Begin typing your search above and press return to search.

ఆయ్యప్ప భక్తితో 50 కోట్ల బాక్సాఫీస్

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:00 AM GMT
ఆయ్యప్ప భక్తితో 50 కోట్ల బాక్సాఫీస్
X
మలయాళం చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకేక్కుతూ ఉంటాయనే సంగతి అందరికి తెలిసింది. హైయెస్ట్ బడ్జెట్ చిత్రం అంటేనే ఒక 25 కోట్ల వరకు ఉంటుంది. మన్యంపులి సినిమా కోసం ఈ స్తాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టారు. అలాగే మమ్ముట్టి మమాగం, మోహన్ లాల్ చేసిన హిస్టోరికల్ ఫ్రీడమ్ ఫైటర్ మూవీ కూడా 50 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కినవె కావడం విశేషం. మలయాళీ సినిమా మార్కెట్ పరిధి తక్కువగా ఉండటంతో వారు కొత్తకథలతో సినిమాలు చేసిన బెస్ట్ కంటెంట్ ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

మలయాళంలో 2 నుంచి 3 కోట్లలో పూర్తిచేసే సినిమా రీమేక్ చేస్తే 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెడతారు. ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే 5 నుంచి 10 కోట్ల మధ్య బడ్జెట్ తో నిర్మితమవుతాయి. అవి ఇక్కడ రీమేక్ చేస్తే 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ పెడతారు. ఈ ఏడాది ఆరంభంలో అన్ని ఇండస్ట్రీలకి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. అలాగే మలయాళీ పరిశ్రమకి కూడా మాళికాపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. తెలుగులో వాల్తేర్ వీరయ్య, తమిళంలో వారిసు, హిందీలో పఠాన్ సినిమాల సక్సెస్ తో బాక్స్ ఆఫీస్ కి మంచి శుభారంభం లభించింది.

ఇప్పుడు మలయాళంలో కూడా ఈ మాళికాపురం సినిమాతో శుభారంభం లభించింది అని చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్ తో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ లో అయ్యప్పస్వామి నేపధ్యంలో సాగే స్పిరిచువల్ థ్రిల్లర్ మూవీగా మాళికాపురం తెరకెక్కింది. కంటెంట్ భాగా ప్రేక్షకులకి కనెక్ట్ కావడంతో ఇప్పుడు మలయాళంలో ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఏకంగా 50 కోట్ల క్లబ్ లో ఈ మూవీ చేరడం విశేషం.

కేరళలో 37.4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.2 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఇతర భాషలలో కోటి కలెక్ట్ చేసింది. ఓవరాల్ లో 50 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ మలయాళీ మూవీగా ఈ ఏడాది మాళికాపురం మంచి శుభారంభం ఇచ్చింది అని చెప్పాలి. తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రమోషన్ లేకపోవడం వలన ప్రజలలోకి రీచ్ కాలేదనే మాట వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.