Begin typing your search above and press return to search.

కళ్ళతోనే కుర్ర గుండెలను బంధీ చేస్తున్న రెడ్ సుందరి!!

By:  Tupaki Desk   |   9 July 2020 4:00 AM GMT
కళ్ళతోనే కుర్ర గుండెలను బంధీ చేస్తున్న రెడ్ సుందరి!!
X
హీరోయిన్ మాళవిక శర్మ.. గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు కుర్రకారుకి పరిచయం అసలు అవసరం లేదు. ఎందుకంటే ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే అందరి హృదయాలను కొల్లగొట్టింది. ముంబైలో పుట్టిపెరిగిన ఈ ముద్దుగుమ్మ తన 19వ యేటనే హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన నేలటికెట్టు సినిమాతో వెండితెర పై అడుగుపెట్టింది. ఈ అమ్మడు తన ఫస్ట్ సినిమాలోనే అందాలన్నీ ఆరబోసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. ఇక కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ మొదలుపెట్టిన మాళవిక.. కొన్ని టాప్ టీవీ కమర్షియల్ యాడ్స్ లో కూడా మెరిసింది. హిమాలయ, మీరా కోకోనట్ ఆయిల్, సంతూర్, గ్లోయిన్ లాంటి వాటి యాడ్స్ చేసి తన ఫస్ట్ సినిమా అవకాశం దక్కించుకుంది. ఇక ఫస్ట్ సినిమా ఆకట్టుకోలేక పోయినా అమ్మడి అందాలకు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి.

ఇక ఈ యంగ్ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా అలా క్షణాలలో అభిమానులు ఆ పోస్ట్ వైరల్ చేసేస్తారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ వ్యక్తిగతంగా లాయర్ అవ్వాలని అనుకుందట. అందుకే ఎల్.ఎల్.బి కూడా చదివింది. ఈ భామ ఖాళీ దొరికితే ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ హీటెక్కిస్తోంది. కానీ అమ్మడి ఫిగర్ చూస్తే ఎలాంటి వారైనా దాసోహం అయిపోవాల్సిందే. అలా ఫోటోలలో అందాలు ప్రదర్శిస్తుంది. తాజాగా వైట్ షర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చొని పెట్టిన పోజు చూస్తే ఖచ్చితంగా మాళవిక డేర్ నెస్ తెలిసిపోతుంది. ఆమె కళ్ళతో నవ్వుతూ కుర్ర గుండెలను బంధీ చేస్తోంది. ఇక ఈ భామ అందాలకు ఫిదా అయిపోయి ఇస్మార్ట్ శంకర్ రామ్ కూడా తన 'రెడ్' సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులో అమ్మడి అందాలకు మంచి మార్కులే పడుతున్నాయి. చూడాలి మరి ఇప్పటికే విడుదల అయిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా అమ్మడి కెరీర్ మలుపు తిప్పుతుందేమో చూడాలి.