Begin typing your search above and press return to search.

రాజా డీలక్స్ లో నటిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పేసింది

By:  Tupaki Desk   |   30 Jan 2023 8:00 AM GMT
రాజా డీలక్స్ లో నటిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పేసింది
X
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఆ సినిమా షూటింగ్ విషయంలో అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. మరో షెడ్యూల్‌ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా లో ప్రభాస్‌ కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముగ్గురు ముద్దుగుమ్మల్లో మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ ఒకరు అని కూడా ప్రచారం జరుగుతోంది.

ఇన్నాళ్లు కూడా సినిమా గురించే అఫిషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక హీరోయిన్ విషయం క్లారిటీ లేనేలేదు. తాజాగా మాళవిక మోహనన్ సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఆ సందర్భంగా తెలుగు సినిమా గురించి స్పందించింది.

మాళవిక మోహనన్‌ ఒక అభిమాని తెలుగు సినిమా ఎంట్రీ ఎప్పుడు అంటూ ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ.. తెలుగు సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతోంది. తప్పకుండా త్వరలోనే ఆ సినిమాను గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఈ అమ్మడు ప్రభాస్ సినిమాలో కాకుండా మరే సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు రాలేదు. కనుక తాను తెలుగు సినిమాలో నటిస్తున్నాను అంటూ చెప్పింది కనుక అది ప్రభాస్‌.. మారుతి సినిమా అయ్యి ఉంటుంది అంటూ చాలా మంది భావిస్తున్నారు. రాజా డీలక్స్ టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్‌ అధికారికంగా రాలేదు.