మలైకా ప్రపోజల్..అర్జున్ కపూర్ ఓపెన్ అవ్వాల్సిన సమయం!

Mon Oct 18 2021 20:00:01 GMT+0530 (IST)

Malaika proposal its time for Arjun Kapoor to open

అర్జున్ కపూర్-మలైకా అరోరా డేటింగ్ వ్యవహారం అంతా బహిర్గతమే. సహజీవనం చేయడంలో తప్పేం లేదు గానీ..కానీ మలైకా- అర్జున్ కపూర్ ల మధ్య వయసు వ్యత్యాసమే విమర్శల పాలు చేసింది. ఇదే విషయాన్ని చాలాసార్లు బాలీవుడ్ మీడియా ప్రశ్నించినా వ్యక్తిగత విషయం అంటూ తప్పించుకున్నారు. ఈ బంధం సహజీవనంతోనే ముగుస్తుందని...ఎంతో కాలం సాగదని ప్రచారం సాగింది. అయితే తాజాగా మలైకా వ్యాఖ్యల్ని బట్టి డేటింగ్ తో సరిపెట్టేలా లేరని మరోసారి జాతీయ మీడియా కోడై కూస్తోంది. అందుకు మలైకా చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 50 ఏళ్లకు చేరువలో ఉన్న మలైకా మనసు మళ్లీ పెళ్లిపై మళ్లినట్లు కనిపిస్తోంది.పెళ్లి గురించి..పెల్లి గొప్పదనం గురించి తన మనసులో దాగిన ఎన్నో విషయాల్ని బయట పెట్టింది. భారతీయ సంప్రదాయ పద్దతిలో జరిగే పెళ్లి అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. పెళ్లి కూతురిలా ముస్తాబై.. తెల్ల బట్టలు కట్టుకుని..వరుడి పక్కన కూర్చొని వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకోవడంలో ఎంతో ఇష్టమని...అందులో ఎంతో సంప్రదాయం..భారతీయ కల్చర్ ఉందని తెలిపింది. వైట్ వెడ్డింగ్ స్టైల్ లో పెళ్లి చేసుకోవడం సూపర్బ్ గా ఉంటోందని అంటోంది. ఇలాంటి ఫీలింగ్ పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి ఎంతో ఎగ్జైట్ మెంట్ ని ఇస్తోందని మలైకా అభిప్రాయపడింది. మలైకా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ సహా అన్ని మీడియాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే మలైకా కు ఒకసారి పెళ్లైంది. బాలీవుడ్ నిర్మాత ఆర్భాజ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత అర్జున్ కపూర్ కి దగ్గరైంది. ఇప్పుడు అర్జున్ కపూర్ తో మరోసారి పెళ్లి పీటలెక్కడానికి 47 ఏళ్ల భామ రెడీ అవుతుందా? అంటూ కామెంట్లు పడుతున్నాయి. మలైకా విషయంలో అర్జున్ కపూర్ కూడా అంతే పాజిటివ్ గా ఉన్నాడు. మీడియా ముఖంగా మలైకా ప్రస్థావన తీసుకొస్తే అర్జున్ కపూర్ అంతెత్తున లేచిపడతాడు. ప్రేమ గొప్పదనం ప్రేమించిన వాళ్లకే తెలుసు అన్నట్లు ఫైర్ అవుతుంటాడు. మరి ఇప్పుడు మలైకా పరోక్షంగా పెళ్లి గురించి చెప్పకనే చెప్పింది కాబట్టి అర్జున్ కపూర్ కూడా ఓపెన్ అవ్వాల్సిన సమయం వచ్చినట్లే కనిపిస్తోంది.