మలైకా అంటే కెమెరా కళ్లకు పిచ్చి అందుకే

Mon Jan 17 2022 10:54:04 GMT+0530 (IST)

Malaika is mad at the camera eyes

మలైకా అరోరా పబ్లిక్ అప్పియరెన్స్ కి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముంబై మీడియా కెమెరాలు తనని వెంటాడి వెంబడించి మరీ ఫోటోల కోసం వెంపర్లాడతాయి. మలైకా బీచ్ విహారాలు.. జిమ్ యోగా వీడియోలు ఫోటోలు ఇప్పటికే సంచలన వ్యస్ ని సాధిస్తున్నాయి. తాజాగా ఈ ఆదివారం బాంద్రాలోని ఒక రెస్టారెంట్ లో లంచ్ డేట్ కోసం మలైకా - అర్జున్ వెళుతుండగా కెమెరా కళ్లు వెంటాడాయి.మరోసారి మలైకా మెంటలెక్కించింది. తనదైన స్టైల్లో షార్ట్ ఫ్రాక్ లో అందాల ఆరబోతతో వేడి పెంచింది పబ్లిక్ లో.  అర్జున్ లేత నీలం రంగు స్వెట్‌షర్ట్ -డెనిమ్‌లు ధరించగా మలైకా వైట్ ఫ్రాక్ లో మ్యాడ్ నెస్ కి కారణమైంది. డేట్ తర్వాత డ్రైవింగ్ చేసే ముందు మలైకా కెమెరాకు ఫోజులిస్తూ ఫోటోగ్రాఫర్ల వైపు తిరిగి చేతులు ఊపింది. ఇంతలోనే పరిసరాల్లోని వందలాది కళ్లు మలైకా పైనే క్లిక్ మనడం ఈ ఫోటోల్లో బయటపడింది.

ఇంతకుముందే అర్జున్ కపూర్ బ్రేక్ అప్ పుకార్లను ఖండించిన తర్వాత 40వ దశకంలో ప్రేమను సాధారణీకరించడంపై మలైకా అరోరా అద్భుతమైన నోట్ ను పంచుకున్నారు.  ఆ నోట్ యూత్ లో వైరల్ అయ్యింది. గత వారం మలైకా- అర్జున్ విడిపోయారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొన్ని ఊహాగానాల తర్వాత అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ లో మలైకాతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి దానికి కౌంటర్ ఇచ్చాడు. అవమానకరమైన పుకార్లకు చోటు లేదు. సురక్షితంగా ఉండండి. ఆశీర్వదించండి. ప్రజలకు శుభాకాంక్షలు. ప్రేమిస్తాను.. అంటూ అర్జున్ వ్యాఖ్యను జోడించాడు. ఈ పోస్ట్‌పై మలైకా రెడ్ హార్ట్ ఎమోజీతో స్పందించింది.

మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో మీ 40లలో ప్రేమను కనుగొనడం ఎలా అన్నదానిపై క్లాస్ తీస్కుంది. అన్నిరకాల పుకార్లకు టోకున ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టింది. మీ 40లలో ప్రేమను కనుగొనడాన్ని జనరలైజ్ చేయకండి. మీ 30లలో కొత్త కలలను కనుగొనడం.. వెంటాడటం సాధారణీకరించండి. మీ 50లలో మిమ్మల్ని మీ లక్ష్యాన్ని కనుగొనడాన్ని సాధారణీకరించండి. జీవితం 25 ఏళ్ళతో ముగియదు. అలా ప్రవర్తించడం మానేద్దాం (sic)`` అని మలైకా నోట్ రాసింది.

మలైకా- అర్జున్ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయినా కానీ ఈ జంట తరచుగా వారి వయస్సు వ్యత్యాసం విషయంలో సగటు వ్యాఖ్యలను స్వీకరిస్తారు. 36 ఏళ్ల వయసులో అర్జున్ 48 ఏళ్ల మలైకా కంటే ఒక దశాబ్దం చిన్నవాడు అన్నదే ప్రధాన ఆరోపణ. అలాంటి వ్యాఖ్యలను తాను మలైకా పెద్దగా పట్టించుకోవడం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అర్జున్ చెప్పాడు. మొదట ప్రజల నుండి వచ్చే వ్యాఖ్యల ద్వారా వెళ్ళేది మీడియా అని నేను అనుకుంటున్నాను. మేము ఆ వ్యాఖ్యల్ని మీడియా కథనాలను 90 శాతం చూడము కాబట్టి ట్రోలింగ్ కు అంత ప్రాముఖ్యత ఇవ్వలేము. ఎందుకంటే అవన్నీ నకిలీవి. అదే తరహా వ్యక్తులు ఉంటారు. వారు నన్ను కలిసినప్పుడు నాతో సెల్ఫీ తీసుకోవడానికి చనిపోతారు! కాబట్టి మీరు ఆ కథనాన్ని నమ్మకండి! అంటూ అర్జున్ కౌంటర్లు వేశాడు గతంలో.