ఆ మూడు లక్షణాలుండే మగాడంటే పడి చస్తా!

Thu Sep 23 2021 16:05:23 GMT+0530 (IST)

Malaika Arora romantically answers about her relationship

బాలీవుడ్ ఐటం గాళ్ మలైకా ఆరోరా- యువహీరో అర్జున్ కపూర్ డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా ఘాటైన ప్రేమాయణ సాగిస్తోంది. యంగ్ హీరో ఏజ్ లెస్ బ్యూటీతో అంతే ఇదిగా ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఈ ప్రేమ పావురాలు పెళ్లికి రెడీ అవుతున్నట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇదంతా బహిర్గతమే అయినా వీడియోలు...ఫోటోలతో సహా వ్యవహారం బయటకు తెలిసినా.. ఇంకా పెళ్లి లేదంటూ సింపుల్ గా తేల్చేసారు ఇన్నాళ్లు. ఇటీవలే మళ్లీ అర్జున్ ని పెళ్లి చేసుకుంటున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.దీనికి మలైకా సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 47 ఏళ్ల బ్యూటీ ఆ రేంజ్ లో బధులిచ్చింది. ఇద్దరి పెళ్లి వరకూ ఇంకా వెళ్లలేదని..జీవితా న్ని..యవ్వనాన్ని ఆస్వాధిస్తున్నామని రొమాంటిక్ గా అన్సర్ ఇచ్చింది. ఇంకా మలైకా తనలో మరో కోణాన్ని కూడా బహిర్గతం చేసింది. పురుషులలో మలైకాకి మూడు లక్షణాలు బాగా నచ్చుతాయట. అందులో మొదటిది తనకి ఘాడంగా ముద్దులు పెట్టేవాడంటే ఇష్టం అని.. అలాంటి వాళ్లంటే వదలబోనని బోల్డ్ కామెంట్ చేసింది. ఇక రెండవది రొమాన్స్ లో నవరసాలు తెలిసి ఉండాలి...క్లీష్ షేవ్ లేకుండా కొంచెం గడ్డం తప్పక ఉండాలంది. సరసాలు ఆడటంలో కాస్త ఘాటుగా వ్యవహరించే వాడే కావాలని...ఈ మూడు లక్షణాలు ఉండే పురుషులంటే పడి చేస్తానని బహిర్గతం చేసింది.

మరి అర్జున్ కపూర్ లో ఈ మూడు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనే అభిమానులు భావించాలి! ప్రస్తుతానికి మలైకా యువ నటుడి ప్రేమలో పీకల్లోతులో మునిగి తేలుతోన్న మాట వాస్తవం. మలైకా 18 ఏళ్ల క్రితం ఆర్భాజ్ ఖానికి పెళ్లి చేసుకుంది. ఆ దంపతులకు ఓ వారసుడు కూడా ఉన్నాడు. కానీ ఇటీవల మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. నాటి నుంచి మలైకా ప్రేమాయణాలపై గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది. ఈ జంటకు ఇప్పట్లో పెళ్లాడే మూడ్ అయితే లేదని కన్ఫామ్ అయ్యింది. ప్రస్తుతానికి రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేసే ఆలోచన మాత్రమే కలిగి ఉన్నారు.