వీడియో: మలైకాతో ప్రధాని మోదీ మీటింగ్..!

Tue Nov 29 2022 20:36:00 GMT+0530 (India Standard Time)

Malaika Arora meet PM Narendra Modi

ఏజ్ తో పనే లేకుండా అందంతో కవ్విస్తున్న మలైకా అరోరా ఎప్పటికీ బాలీవుడ్ స్టైల్ ఐకన్ గా వెలిగిపోతోంది. స్టైల్ కంటెంట్ లో మలైకా రేంజే వేరని నిరూపణ అయ్యింది. ఆల్ టైమ్ హాటెస్ట్ ఫోటోషూట్లతో అంతర్జాలంలో దుమారం రేపుతోంది.  మలైకా ప్రస్తుత ఏజ్ 48. హాఫ్ సెంచరీకి చేరువైంది. అయినా ఇంకా వయసు ఒక నంబర్ మాత్రమే. వేడెక్కించేందుకు కవ్వించేందుకు వయసుతో పని లేదని నిరూపిస్తోంది. తనకంటే చాలా చిన్న వయసు చాక్లెట్ బోయ్ అర్జున్ కపూర్ తో  డేటింగ్ చేస్తూ నిరంతర వార్తల్లో నిలుస్తోంది.తాజాగా మలైకాకు చెందిన ఓ  వీడియో నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ప్రధాని మోదీనా? అని పలువురు ప్రశ్నలు కురిపించారు. మోదీ కాదు అని కానీ.. మోదీనే అని కానీ మలైకా చెప్పడం లేదు. నెటిజనుల్లో కొందరు ఔత్సాహికులు మాత్రం ఆయనను ప్రధాని మోదీ అని నమ్ముతున్నారు. ``సబ్ యహా యే దేఖ్ రహే హై కి యే మోడీ జీ జేసే క్యు లాగ్ రహే హై .. ఈ వ్యక్తి నరేంద్ర మోడీలా ఎందుకు కనిపిస్తున్నాడు?`` అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. మలైకా నుండి దూరంగా చూడగలిగితే.. అది అతను కాదని మీకు తెలుస్తుంది!! అని మరొకరు చమత్కరించారు. ``మోదీ జీకి కార్బన్ కాపీ`` అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు.

బాలీవుడ్ లో ఆరంగేట్రమే మలైకా అరోరా అద్భుత నృత్యకారిణిగా అలరించింది.  మలైకా తన కెరీర్ ను VJ గా ప్రారంభించింది. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. కొన్ని అద్భుతమైన హుక్ స్టెప్పులతో ఐటమ్ క్వీన్ గా మరిపించింది. మత్తెక్కించే కదలికలు హాటెస్ట్ లుక్స్ ఎక్స్ ప్రెషన్స్ తో భారీగా ప్రేక్షకుల హృదయాలను దొంగిలించింది. సల్మాన్ దబాంగ్ లో మున్నీ బద్నామ్ హుయ్ సాంగ్ ఇప్పటికీ మలైకా కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఈ ఒక్క పాట చాలు.. మలైక ఎంత ఆకర్షణ కలిగిన ప్రతిభావంతురాలు అనేది గుర్తించేందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

ప్రస్తుత కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మలైకా గత ఐదేళ్లుగా చాలావరకూ పెద్దతెరకు దూరమైంది.  కానీ ఆమె ఎట్టకేలకు ఘనంగా పునరాగమనం చేస్తోంది. యాక్షన్ హీరో సినిమాలోని ``ఆప్ జేసా కోయి`` పాటలో అదరగొట్టబోతోంది. తదుపరి `యాన్ యాక్షన్ హీరో` చిత్రంలో నటుడు ఆయుష్మాన్ ఖురానా నిజ జీవితంలో ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొనే యాక్షన్ సినిమా స్టార్ గా నటించనున్నారు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ లోని రెండో పాట పబ్లిక్ గా విడుదలైంది. ఆప్ జైసా కోయి అనే పాటలో మలైకా అరోరా 1980 నాటి పాపులర్ బల్లాడ్ వెర్షన్ కి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ పాట వీడియోలో మలైకా చాలా హాట్ గా కనిపించనుంది.

మలైకా అరోరా ఉత్తరాది దక్షిణాది పరిశ్రమల్లో పాపులర్ ఐటెమ్ నంబర్లలో నర్తించింది. ప్రతిసారీ పాత రూపానికి భిన్నంగా కనిపించడం తనకు మాత్రమే చెల్లింది. షారుఖ్ ఖాన్ తో కలిసి పాపులర్ నంబర్ చయ్యా చయ్యాలో అద్భుత నృత్యంతో అలరించింది. మున్నీ బద్నామ్ హుయ్- అనార్కలీ డిస్కో చలీ- కాల్ ధమాల్ పాపులర్ డ్యాన్స్ నంబర్ లలో కొన్ని.

వేడెక్కించే రియాలిటీ షోతో..

మలైకా ఇటీవల ఫ్యాషన్ ఈవెంట్లు -బుల్లితెర కార్యక్రమాలతో అసాధారణంగా ఆర్జిస్తోంది. యోగా గురువుగానూ యూట్యూబ్ లో భారీ ఆదాయ ఆర్జనను కలిగి ఉంది. తదుపరి వేడెక్కించే రియాలిటీ షోతో అభిమానుల ముందుకు రాబోతోంది. హాట్ స్టార్ స్పెషల్స్ లో `మూవింగ్ ఇన్ విత్ మలైకా` పేరుతో ఈ షో డిసెంబర్ నుంచి ప్రసారం కానుంది. సోమవారం నుంచి గురువారం వరకూ 8పీఎం ప్రైమ్ టైమ్ లో ఇది అలరించనుంది. మూవింగ్ ఇన్ విత్ మలైకా ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.