వీడియో: 50లోనై 20 కావాలంటే ఇలా చేయాలి!

Thu Jul 07 2022 09:00:01 GMT+0530 (India Standard Time)

Malaika Arora latest gym video

యవ్వనం దూరమవ్వకుండా దేవతలు అమృతం తాగారు. మానవులకు ఆ అవకాశం లేదు. సరైన క్రమశిక్షణతో యోగా మెడిటేషన్ కసరత్తులు సరైన ఆహారంతో మాత్రమే మనకు యవ్వనం సాధ్యం. ఇది పక్కా ప్రాక్టికల్ గా నిరూపిస్తోంది మలైకా అరోరాఖాన్. వయసు 50కి చేరువ అవుతున్నా కానీ ఇంకా 20 ప్లస్ కాలేజ్ గాళ్ లానే కనిపిస్తోంది. టీనేజీ గాళ్స్ కి సైతం మలైకా ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ మలైకాను వీడి ఉండలేడంటే అంతగా తనలో ఏం మ్యాజిక్ ఉంది? అని ప్రశ్నించేవారికి ఇదిగో ఈ వీడియోనే సాక్ష్యం. మలైకా నిత్య యవ్వనంతో మిలమిల మెరిసిపోవడమే దీనికి కారణం. తనలోని బ్రిలియన్సీకి అర్జున్ ముగ్దుడైపోతానని ఇంతకుముందు చెప్పాడు. యోగాతోనే నిత్యయవ్వన రూపం సాధ్యమని మలైకా పదే పదే నిరూపిస్తోంది.

తాజా వీడియోలో మలైకా తలకిందులుగా అసనంలో కనిపించింది. తన చేతులను నేలపై ఆన్చి గోడ ఆసరాగా యోగాసనం వేసింది. ``కాంట్ హోప్ ఆన్ దిస్ ట్రెండ్.. రీమిక్స్ దిస్ రీల్ అండ్ షేర్ యువర్ వీడియో విత్ మీ!`` అంటూ యూత్ ని టీజ్ చేసింది మలైకా.

సోషల్ మీడియాల్లో నేటితరం మలైకా వెంట పడుతూ ఇలాంటి వీడియోలను చేసి షేర్ చేస్తున్నారు. కొందరైతే నడుము విరిగింది మ్యాడమ్! అంటూ తమ బాధలను మలైకాకు చెప్పుకుంటున్నారు. దీనర్థం యోగా అనేది గురువు సమక్షంలో చేయాల్సినది.

తేడాలొస్తే చాలా ప్రమాదం. సింపుల్ గా ఉండే అసనాల వరకూ ఓకే కానీ కొన్ని కఠినంగా సాధన చేయాల్సినవి ఉన్నాయి. వాటిని మాత్రం గురువు సమక్షంలోనే చేయాలి. యాభైలో 20 కావాలంటే మలైకా ను గురువుగా చేసుకుంటే సరి!! మలైకా ఆన్ లైన్ లో తన యోగా వీడియోలను షేర్ చేస్తుంటే వాటిని అనుకరించేవారికి కొదవేమీ లేదు. యూట్యూబ్ లో మంచి డిమాండ్ ఉంది.

ఇటీవల ప్రియుడు అర్జున్ కపూర్ తో ప్యారిస్ విహారం ముగించి ముంబైకి తిరిగి వచ్చిన మలైకా తదుపరి షెడ్యూళ్లలో తలమునకలుగా ఉంది. అయితే ఎన్ని షెడ్యూళ్లు ఉన్నా కానీ వాటిని స్కిప్ కొట్టకుండా ఇలా యోగా కోసం రోజూ గంట కేటాయిస్తోందట. అదే తన అందం వెనక అసలు రహస్యం.