ఫోటో స్టోరీ : జిమ్ డ్రెస్ లో మలైకం

Thu Apr 18 2019 07:00:01 GMT+0530 (IST)

Malaika Arora Spotted At Zym

మలైకా అరోరాఖాన్ ఫ్యాషన్ & ట్రెండ్స్ గురించి తెలిసిందే. ఎవ్వర్ లేటెస్ట్ ఫ్యాషన్ ని ఫాలో అవుతుంది. మార్కెట్లో ఇలా ఏదైనా కొత్త మోడల్ డ్రెస్ దిగిందంటే చాలు అలా మలైకా ఒంటిపై వాలిపోవాల్సిందే. ఎప్పటికప్పుడు అల్ట్రా మోడ్రన్ లుక్ తో నిరంతరం చర్చల్లో ఉంటుంది ఈ బ్యూటీ. ముంబైలో జరిగే టాప్ రేంజ్ ఫ్యాషన్ ఈవెంట్లలో మలైకా అప్పియరెన్స్ తప్పనిసరి. ఫేజ్ 3 ప్రపంచంలో తనకు ఉన్న ఇమేజ్ అలాంటిది.ఇక మలైకా ఫిట్ నెస్ సీక్రెట్స్ గురించి తెలిసిందే. రెగ్యులర్ గా క్రమం తప్పకుండా జిమ్ లో గంటల కొద్దీ సమయం వెచ్చిస్తుంది. స్విమ్మింగ్ .. వాకింగ్ .. థ్రెడ్ మిల్లింగ్ .. కాస్తంత కఠోరమైన వ్యాయామాలు సైతం చేస్తుంది జిమ్ లో. మలైకా జిమ్ చేసే ఫోటోలు.. వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో జోరుగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అమ్మడు ముంబైలోని ఓ పోష్ ఏరియాలో జిమ్ నుంచి బయటకు వచ్చినప్పటి ఫోటో ఒకటి యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.

బ్లాక్ కలర్ స్పోర్ట్స్ టాప్.. బాటమ్ లో రకరకాల కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసిన లెగ్గింగ్ తో కనిపించింది. స్టైలిష్ గాగుల్ ధరించి అంతే దర్పంతో జిమ్ బయట నడుచుకుంటూ కార్ దగ్గర నుంచి వెళుతోంది. మలైకానా మజాకానా? అంటూ బోయ్స్ లో ఈ ఫోటో గురించి ఒకటే ముచ్చట సాగుతోంది. యువహీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ గురించి మలైకా ఇంతవరకూ పెదవి విప్పనే లేదు. అయితే పెళ్లి అంటూ వచ్చిన రూమర్లను మాత్రం సింపుల్ గా కొట్టి పారేసింది. సిల్లీ గాయ్స్.. సిల్లీ ప్రచారం! అంటూ తీసిపారేసింది. ప్రస్తుతానికి పెళ్లి లేదు. కేవలం స్నేహం మాత్రమే.