Begin typing your search above and press return to search.

బెడ్రూం ఫోటో షేర్ చేసింది.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   29 May 2023 2:00 PM GMT
బెడ్రూం ఫోటో షేర్ చేసింది.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు
X
రీల్ లైఫ్ లో అందాల ఆరబోతం అంటే.. సినిమా కావటం.. దర్శక నిర్మాత చెప్పిన మాటను వినాలనుకొని సరిపెట్టుకోవచ్చు. రియల్ లైఫ్ లోనూ సినిమాల్లో మాదిరి స్కిన్ షో చేయాల్సిన అవసరం ఉందా? అంటే అదో పెద్ద డిబేట్. ఎవరిష్టం వారిది.. మధ్యలో ఈ సుద్దులు ఎందుకు? అంటూ క్లాసులు పీకే వాళ్ల దగ్గర నుంచి మోరల్ పోలీసింగ్ చేస్తారా? అంటూ ఫైర్ అయ్యేవారు కనిపిస్తారు. అయితే.. అవసరం లేని ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేయాల్సిన అవసరం ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానం కనిపించదు.

ఇమేజ్ బిల్డింగ్.. నలుగురు తమ గురించి మాట్లాడుకోవాలి.. మీడియా ఫోకస్ చేస్తుండాలి.. లైమ్ లైట్ వెలుతురులో వెలిగిపోతుండాలి.. లాంటి జాఢ్యాలెన్నో గ్లామర్ ప్రపంచంలోని వారిలో కనిపిస్తాయి. మోతాదుకు మించి చేసే పనులకు తిట్లు తిట్టించుకోవాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి కోతి పనే చేసింది గ్లామర్ భామ మలైకా అరోరా.

మాజీ భర్త అర్బాజ్ ఖాతో కలిసి పలు చిత్రాలు నిర్మించిన ఆమె.. ఓటీటీల్లో కనిపిస్తున్నారు. మోతాదు మించిన గ్లామర్ ను ఒలకబోస్తూ తరచూ వార్తల్లో కనిపించే ఆమె తనకంటే పన్నేండేళ్ల చిన్నవాడైన సినీ హీరో అర్జున్ కపూర్ తో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే.

మీ పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పని ఆమె.. తమ మధ్యనున్న అనుబంధాన్ని తెలిపే ఫోటోల్ని పోస్టు చేస్తుంటారు. తాజాగా అర్జున్ కపూర్ కు చెందిన ఒక ఫోటోను షేర్ చేయటం.. దానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నా లేజీ బాయ్ (బద్ధకస్తుడైనోడు) అంటూ అర్జున్ కపూర్ ఒంటి మీద ఏమీ లేకుండా బెడ్ మీద ఉండటం.. మధ్యలో పిల్లోను ఉంచిన ఫోటోను షేర్ చేసింది.

దీనిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అది మీ ఇష్టం.. కానీ ఒక టీనేజ్ పిల్లోడికి తల్లిగా ఉంది సోషల్ మీడియాలో ఇలా ప్రవర్తిస్తే ఎలా? అన్న ప్రశ్నతో పాటు.. 'నువ్విలా విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఆ అబ్బాయి బయట ఎలా తిరుగుతాడు? ఎంతమంది అతడ్ని ప్రశ్నలతో ఇబ్బంది పెడతారో తెలీదా? 'ఈమె చేసే చిల్లర చేష్టల కారణంగా అతను తాను చదువుకునే ప్లేస్ లో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. మరీ హద్దులు మీరుతున్నావు.. ఇలాంటి పోస్టు చేయాల్సిన అవసరం ఉందా? నీ బెడ్రూం విషయాలు పోస్టు చేయాల్సిన పనేంటి?’ అంటూ వరుస కామెంట్లతో ఉతికి ఆరేస్తున్నారు.

నిజమే.. హద్దులు దాటకుండా తమ అన్యోన్యతను చాటే ఫోటోలకు ఎవరు మాత్రం అభ్యంతరం చెబుతారు? మల్లికకు ఆ మాత్రం ఎందుకు తెలీడటం లేదు చెప్మా?