ఎయిర్ పోర్ట్ లో కెవ్వుకేక పెట్టించిన మలైకా?

Fri Jul 30 2021 22:00:01 GMT+0530 (IST)

Malaika Arora At Airport

`బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్` మలైకా ఆరోరా ఇండస్ట్రీ ఫ్యాషనిస్టాగా యువతరంలో నిరంతరం హాట్ టాపిక్. న్యూ ట్రెండీ డిజైనర్ లుక్... ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టడం మలైకా ప్రత్యేకత. టాప్ లెస్ ఫోజులివ్వడం.. బికినీ.. టూపీస్ ఫోజుల్లో టూమచ్ గా రచ్చ చేయడం మలైకాకు హాబీ.. ఇక మ్యాగజైన్ కవర్ పేజీల్లో మలైకా  ఎలివేషన్స్ ఏ స్థాయిలో  ఉంటాయో తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా మలైకా ఫ్యాన్స్ కామెంట్లు అంతే కిక్కెక్కిస్తుంటాయి. తాజాగా ఈ హాట్ ఏజ్డ్ గాళ్ మరోసారి ఎయిర్ పోర్ట్ లో హాట్ హట్ గా కెమెరా కంటికి చిక్కింది. బ్లాక్ కలర్  డిజైన్ డెనిమ్ జీన్స్ .. వైట్ కలర్ ఇన్నర్ ధరించి.. దానిపై  ముదురు ఆరెంజ్ రంగు షర్ట్ ధరించింది.వేడెక్కించే లుక్ లో మలైకా మరోసారి కుర్రకారుని కెవ్వుకేక పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజనులు హాట్ హాట్ కామెంట్లతో హీటెక్కిస్తున్నారు. వయసు 45 ప్లస్ అయినా అయినా మలైకా ఫిట్ నెస్ విషయంలో ఎంతో కేరింగ్ గా ఉంటుంది. యోగా వ్యాయామాలతో ది బెస్ట్ గా స్కిన్ టోన్ మెయింటెన్ చేయడంలో మలైకా స్పెషలిస్ట్. అందుకే బార్డర్ ఏజ్ కు చేరువలో ఉన్నా దాంతో పనే లేకుండా కుర్రకారుని ఊపేస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతోంది. ఇక మలైకా సినిమాల విషయానికి వస్తే `గబ్బర్ సింగ్`లో కెవ్వు కేక పాటతో అప్పట్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే లేట్ ఏజ్ బయటపడడంతో కొంత క్రిటిసిజం ఎదురైంది. అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన `అతిధి` సినిమాలో మెరిసింది. కానీ ఆ సినిమా సరైనా ఫలితాలు సాధించకపోవడంతో మలైకా టాలీవుడ్ ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది.

అయితే అప్పటికే మలైకా బాలీవుడ్ లో టాప్ ఐటమ్ గాళ్ గా పాపులరైంది. ప్రస్తుతం  బాలీవుడ్ లో క్రేజీ డాన్సర్ గా రాణిస్తోంది. అగ్ర హీరోల చిత్రాల్లో మలైకా తో ఐటమ్ సాంగ్స్ పరంగా ఆఫర్లు తగ్గినా బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోలతో ఆకట్టుకుంటోంది.