పెళ్లి లేదు.. సిల్లీ గాయ్స్ అనేసిందే!

Mon Apr 15 2019 13:58:20 GMT+0530 (IST)

Malaika Arora Khan And Arjun Kapoor

గత కొంతకాలంగా బాలీవుడ్ ఐటెమ్ గాళ్ మలైకా అరోరాఖాన్ (45) - యువహీరో అర్జున్ కపూర్ (33) ఎఫైర్ గురించి సోషల్ మీడియా కథలు కథలుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. మలైకా .. అర్జున్ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారని.. ఎక్కడికి వెళ్లినా ఆ ఇద్దరూ కలిసే వెళుతున్నారని.. ఇవిగో ప్రత్యక్ష సాక్ష్యాలు అంటూ ఫోటో ప్రూఫ్ లు .. వీడియో ప్రూఫ్ లు చూపిస్తూ కథనాలు అల్లాయి. నిప్పు లేనిదే పొగరాదని అంటారు! అదే చందంగా ఆ ఇద్దరి సహజీవనం.. ఎఫైర్ ని పలు మీడియాలు కన్ఫామ్ చేస్తూ కథనాలు ప్రచురించాయి. కొన్ని మీడియాలు మరికాస్త అడ్వాన్స్ డ్ గా ముందుకు వెళ్లి.. ఈ ఏప్రిల్ లోనే పెళ్లి జరగనుంది. 18 నుంచి 22 మధ్యలో గోవా వేదికగా ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. హిందూ - క్రిస్టియన్ సాంప్రదాయాల్లో పెళ్లికి సైలెంటుగా ఏర్పాట్లు సాగుతున్నాయని ప్రచారం చేశాయి.అయితే తమ మధ్య ఎఫైర్ విషయాన్ని మలైకా కానీ.. అర్జున్ కపూర్ కానీ ఇంతవరకూ అధికారికంగా ఒప్పుకున్నదే లేదు. లైఫ్ లో విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను.. నా జీవితం తెరిచి ఉంచిన పుస్తకం! అంటూ మలైకా స్టేట్ మెంట్ ఇచ్చారు తప్ప అర్జున్ తో సహజీవనాన్ని అంగీకరించలేదు. ఇన్ని రకాల ప్రచారం నడుమ ఇటీవలే తన గాళ్ గ్యాంగ్ తో కలిసి మాల్దీవుల్లో కళ్లు చెదిరే పార్టీ చేసుకుంది మలైకా.  ఆ పార్టీకి అర్జున్ యథావిధిగా ఎటెండ్ అయ్యి.. తిరిగి వెళుతూ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కాడు. పెళ్లికి ముందు బ్యాచిలరెట్టీ (bachelorette trip) పార్టీ ని మలైకా ఇలా ఘనంగా ప్లాన్ చేశారని మీడియా ప్రచారం చేసింది. మంగళవాద్యాల మధ్య మూడుముళ్లు వేయడమే తరువాయి! అన్నంతగా ప్రచారం ఊదరగొట్టేసింది.

ఇంతలోనే కొత్త ట్విస్టు ఇది. మలైకా అరోరాఖాన్ తాజాగా ఊహించని ట్విస్టివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ప్రఖ్యాత బాలీవుడ్ మీడియా.. సదరు యువహీరోతో పెళ్లి వ్యవహారంపై మలైకాను ప్రశ్నించింది. ఇటీవల అర్జున్ కపూర్ తో పెళ్లి వ్యవహారంపై వస్తున్న వార్తల్లో నిజమెంత? అంటూ ప్రశ్నిస్తే..``అందులో ఎలాంటి నిజం లేదు.. అవన్నీ సిల్లీ స్పెక్యులేషన్స్!`` అంటూ మలైకా కొట్టి పారేశారు. అయితే మలైకా ఎంత కొట్టి పారేసినా ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యాన్ని ఇంకా అందరూ బలంగానే విశ్వసిస్తున్నారు. స్నేహితులు సన్నిహితులు ఆ ఇద్దరి బంధానికి సపోర్టుగా నిలవడం పదే పదే చర్చకు వస్తోంది. క్లోజ్ గా చూసిన వాళ్లే ఈ రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారనడంలో సందేహం లేదు.