ఒంటరి దీవిలో ఆవిడ .. కుర్రహీరో మిస్సింగ్!!

Sat Jul 20 2019 20:25:43 GMT+0530 (IST)

విదేశీ పర్యటనలు .. ఒంటరి దీవుల్లో షికార్లు మలైకాకి కొత్తేమీ కాదు. ఒక రకంగా ఇదో నిత్యవ్యాపకం. వీలున్న ప్రతిసారీ ఏదో ఒక కొత్త డెస్టినేషన్ కి  వెళ్లి ఎంజాయ్ చేయడం ఈ అమ్మడికి అలవాటు. అయితే మలైకా మాత్రమే వెళితే అందులో పట్టించుకోవడానికేం లేదు. తనతో పాటే చెలికాడు అర్జున్ కపూర్ కూడా ఉంటేనే మీడియాకి ఎక్కడా లేని ఎగ్జయిట్ మెంట్. అయితే ఈసారి మాత్రం గురుడు మిస్సవ్వడం నిరాశనే కలిగిస్తోంది.తాజాగా మలైకా మాల్దీవుల విహారం నుంచి కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. బ్యాక్ టు ద ప్యారడైజ్ అంటూ షేర్ చేసిన ఈ ఫోటోల్లో మలైకాతో పాటుగా ఆమె మేనేజర్ ఏక్తా ఒబేరాయ్ .. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ట తదితరులు ఉన్నారు. వీళ్లతో పాటే ఓ ట్రావెల్ మ్యాగజైన్ ఎడిటర్ కూడా ఉన్నారట. అరడజను గ్రూప్ సభ్యులంతా కలిసి ప్రత్యేకించి ఓ ప్రయివేట్ జెట్ బుక్ చేసుకుని మరీ మాల్దీవుల్లో అడుగు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతమంది గుంపుగా వచ్చారు కాబట్టి.. ఇదేదో మోడలింగ్ అసైన్ మెంట్ అనే అర్థమవుతోంది. అందుకే ఈసారి అర్జున్ కపూర్ మిస్సయ్యాడని సందేహించాల్సి వస్తోంది.

45 ఏళ్ల మలైకా.. 34ఏళ్ల అర్జున్ మధ్య ప్రేమ వ్యవహారం ప్రతిసారీ హాట్ టాపిక్. ఆ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేయడంపై మీడియాలో కథనాలొస్తున్నాయి. అప్పట్లో మాల్దీవుల వెకేషన్ నుంచి ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. ఈ జంట పెళ్లికి ఇంకెంతో సమయం లేదని ప్రచారమైంది. ఇకపోతే.. ఇంత ఏజ్ లోనూ మలైకా ఫిట్ నెస్ యువతరంలో హాట్ టాపిక్ గా మారుతోంది. తీగలాంటి దేహశిరుల్ని కాపాడుకునేందుకు ఈ భామ రెగ్యులర్ జిమ్.. యోగా.. మెడిటేషన్ తో అదుపులో పెడుతోంది.