బ్యాక్ ఫోటోతో హాట్ పుట్టించిందిగా

Wed Sep 11 2019 23:00:02 GMT+0530 (IST)

Malaika Arora Backless Pic Vial In Social media

45 ఏళ్ల వయసున్న సుందరిని ఫ్రౌఢ అనకుండా ఉండలేం. కానీ..వయసులోనే కానీ.. మనసుకు.. శరీరానికి ఏ మాత్రం వయసు రాలేదన్న విషయాన్ని తాజా ఫోటోతో చెప్పేసింది బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. పాతికేళ్ల పోరీ మాదిరి ఫిజిక్ మొయింటైన్ చేయటం.. మీద పడే వయసును దరి చేరకుండా చూసుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు.కానీ.. ఆ విషయంలో తనను కొట్టే వారే లేరన్నట్లుగా తాజాగా తన ఫోటోను షేర్ చేసింది మలైకా అరోరా. తన ఆటపాటలతో ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో మంట పుట్టి నిద్ర లేకుండా చేసిన ఆమె.. తాజాగా తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో కనిపిస్తోంది.

మలైక పేరు చెప్పినంతనే చయ్య.. చయ్య పాట గుర్తుకు రావటమే కాదు.. అతిధిలో ఐటెమ్ సాంగ్.. గబ్బర్ సింగ్ లో కెవ్వుకేక యథాలాపంగా నోటి నుంచి వచ్చేస్తాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడ్ని పెళ్లాడి.. విడాకులు తీసుకొని ప్రస్తుతం తనకంటే పన్నెండేళ్ల చిన్నోడైన అర్జున్ కపూర్ (బోనీకపూర్ మొదటి భార్య కొడుకు) తో సహజీవనం చేస్తున్న వార్తలు హోరెత్తుతున్నాయి.

ఈ విషయం మీద ఇప్పటికి క్లారిటీ ఇవ్వని ఈ భామ.. తాజాగా కొంతకాలం క్రితం తాను దిగిన త్రో బ్యాక్ టాప్ లెస్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫార్టీ ప్లస్ లోనూ పాతికేళ్ల అందానికి అసూయ పుట్టేలా ఉన్న ఆమె ఒంపుసొంపులు చూస్తే.. వారెవ్వా మలైకా అనాల్సిందే.