పోస్టర్ టాక్: వకీల్ సాబేనా.. నకిలీ సాబా..?

Tue Mar 31 2020 09:26:51 GMT+0530 (IST)

Make Believe Poster of Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ చిత్రానికి రీమేక్ ఇది. ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు- బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానుల్లోకి ఈ పోస్టర్ దూసుకెళ్లింది. ఇక దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజారిటీ పార్ట్ మిక్స్ డ్ టాక్ వినిపించింది.ఇక ఆ పోస్టర్ తో పోలిస్తే తాజాగా రిలీజైన పోస్టర్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి. అసలు వకీల్ సాబ్ లుక్ ఎలా ఉంటుంది? అన్నదాన్ని ఎగ్జాక్ట్ గా వంద శాతం పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తోంది ఈ పోస్టర్. ఒక కోర్టు .. ఆ కోర్టు ఆవరణలో వకీల్ సాబ్ (పవన్)  ఒక చేత్తో ఫైల్స్ .. మరో చేత్తో రిపోర్టులు ఉన్న లెదర్ బ్యాగ్ ని పట్టుకుని నడుస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి మేకప్ వేసుకునేందుకు ప్రిపేరైన పవన్ లుక్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలానే ఈ పోస్టర్ లుక్ కనిపిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సెకండ్ లుక్ ఇదేనంటూ జోరుగా ప్రచారం సాగిపోతోంది. ఈ పోస్టర్ చూసిన ఎవరైనా కచ్ఛితంగా ఆ విషయాన్ని నమ్మేస్తున్నారు. అయితే ఇది చిత్రబృందం రిలీజ్ చేసిన అధికారిక పోస్టరేనా? అంటే కానే కాదు.

ఇది ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్. పోస్టర్ పై ముఖాన్ని మార్ఫింగ్ చేసారు. వేరొక లాయర్ సాబ్ మూవీ పోస్టర్ కి పవన్ ఫేస్ ని మార్ఫ్ చేసి ఉంటారని అర్థమవుతోంది. అయితే ఆ లుక్ అచ్చం వకీల్ సాబ్ లుక్ అని నమ్మేయాల్సినంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడాన్ని ప్రశంసించాల్సిందే. పవన్ చూపు.. మీసకట్టు.. గిరజాల జుత్తు ఇదంతా చూస్తుంటే ఏమాత్రం డౌట్ అన్నదే పుట్టడం లేదు మరి.

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై పోరాడుతోంది. వైరస్ సృష్టిస్తున్న వినాశనంపై దృష్టి సారించినందున షూటింగులు నిలిపేసిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ వకీల్ సాబ్ పైనా ఈ ప్రభావం పడింది. మహమ్మారీని తరిమేసేందుకు నేను సైతం అంటూ పవన్ కల్యాణ్ తనవంతుగా భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పవన్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.