మేజర్ వీడియో సాంగ్.. మరో ఎమోషనల్ టచ్

Wed May 25 2022 13:01:58 GMT+0530 (IST)

Major Video Song .. Another Emotional Touch

2008 ముంబై ఉగ్రదాడిలో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ప్రస్తుతం ఇండియా మొత్తంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో అడివి శేష్ మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇక అతని ప్రేయసిగా ఇషా పాత్రలో సాయి మంజ్రేకర్ నటించింది. మరొకవైపు మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించడం కూడా సౌత్ ఇండస్ట్రీ లో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. దీంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు

చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రమోషన్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఒక లవ్ సాంగ్ ను కూడా ఇటీవలే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. హృదయమా.. అనే పాటను సిద్ శ్రీరామ్ పాడగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. అంతేకాకుండా వీడియో సాంగ్ కూడా రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పాట ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకట్టుకుంటోంది అనే చెప్పాలి.

ఒక ప్రేమికుడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి ముందు ఎలాంటి అనుభూతులను పొందాడు అంతేకాకుండా తన ప్రేయసితో ఎలాంటి ప్రయాణాన్ని కొనసాగించాడు అనే అంశాన్ని కూడా పాటలో అద్భుతంగా చూపించారు. తల్లిదండ్రులతో నేను చిన్నప్పుడు లేను.. ఇప్పుడు నువ్వు కూడా వదిలి వెళ్ళిపోతున్నవా.. అంటూ ప్రేయసి   చెప్పిన మాటలకు ఉన్నికృష్ణన్ వెళుతున్న ప్రయాణానికి చాలా ఎమోషనల్ టచ్ ఇచ్చింది.

మేజర్ ఉన్నికృష్ణన్ తన ఆర్మీ ప్రయాణంలో తన జీవిత భాగస్వామిని కూడా చాలా మిస్ అయినట్లు సినిమాలో హైలెట్ చేసి చూపించబోతున్న ట్లు తెలుస్తోంది. దేశం కోసం కేవలం అతని ప్రాణాలు మాత్రమే ఇవ్వలేదు.

అని అతని వెనుక ఎంతో జీవిత గాధ ఉంది అని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. సోనీ పిక్చర్స్ తో కలిసి మహేష్ బాబు కూడా సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ నెల 3వ తేదీన మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.