న్యూ రిలీజ్ డేట్ కి ఇంకా టైముందా?

Sat Jan 29 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

Major Movie New Release Date

జనవరికి సంక్రాంతి బరిలో దిగాలని ప్రయత్నాలు చేసిన ఆర్ ఆర్ ఆర్ రాధేశ్యామ్ చిత్రాలు కోవిడ్ ఒమిక్రాన్ కారణంగా రిలీజ్ ని వాయిదా వేసుకున్నాయి. థియేటర్లలో 50 వాతం ఆక్యుపెన్సీ నైట్ కర్ఫ్యూ కారణంగా కలెక్షన్ లపై ప్రభావం పడే అవకాశం వుందని అలాంటి పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేస్తే భారీ నష్టాలని చవి చూడాల్సి వస్తుందని ముందే ఊహించిన ఈ రెండు చిత్రాల మేకర్స్ ముందు జాగ్రత్తగా రిలీజ్ లని వాయిదా వేశారు.తాజాగా పరిస్థితులు క్రమ క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో పెద్ద చిత్రాల రిలీజ్ లని ఖరారు చేస్తూ రిలీజ్ డేట్ లని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  `ఆర్ ఆర్ ఆర్` ని మార్చి 18న కానీ లేదా ఏప్రిల్ 28న కానీ రిలీజ్చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్`రిలీజ్ కోసం కూడా రెండు రిలీజ్ డేట్ లని ప్రకటించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మార్చి ఫస్ట్ వీకెండ్ లో వచ్చే శుక్రవారం లేదా సెకండ్ వీకెండ్ లో వచ్చే శుక్రవారం రిలీజ్ చేయాలని అలా కుదరని పరిస్థితుల్లో ఏప్రిల్ లో సేమ్ అదే శుక్రవారం థియేటర్లలోకి సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

త్వరలోనే అధికారికంగా ఈ డేట్ లని `రాధేశ్యామ్` టీమ్ ప్రకటించబోతోంది. మరో పక్క `భీమ్లా నాయక్` కోసం కూడా మేకర్స్ పై రెండు చిత్రాల తరహాలోనే రెండు రిలీజ్ డేట్ లని రిజర్వ్ చేసి పెట్టుకున్నారట. మార్చి 25 తప్పితే ఏప్రిల్ 1న విడుదల చేయాలని త్వరలోనే ఈ తేదీలని ప్రకటించాలని భావిస్తున్నారట. ఇదిలా వుంటే అడివి శేష్ నటిస్తున్న `మేజర్` మూవీ కోసం మాత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ముందు ఈ మూవీని ఫిబ్రవరి 11న విడుదల చేయాలని బావించారు. రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు కూడా.  అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పెద్ద చిత్రాల రిలీజ్ డేట్ లు మారడంతో `మేజర్` రిలీజ్ ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించ లేదు.  ఆర్ ఆర్ ఆర్ రాధేశ్యామ్ భీమ్లా నాయక్ చిత్రాలు మార్చి లేదా ఏప్రిల్ లో థియేటర్లలోకి రావడానికి ఆసక్తిని చూపిస్తుంటే `మేజర్` మేకర్స్ మాత్రం సైలెంట్ గా వుంటున్నారేంటినే వాదన వినిపిస్తోంది. న్యూ రిలీజ్ డేట్ కి ఇంకా టైముందా? అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చర్చపై `మేజర్` మేకర్స్ ఏమంటారో చూడాలి.