`మజిలీ` వైఫ్ లా హబ్బీని వంటలతో పడేయాలనా!

Mon Jun 08 2020 08:00:01 GMT+0530 (IST)

Majili Wife Impresses with the dishes

ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఆర్ట్. ఈ కళలో నేను సైతం అంటోంది సమంత. స్వీయ నిర్భంధ సమయాన్ని ఒక్కో సెలబ్రిటీ ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటే సమంత మాత్రం ఎంతో విలువైన అర్థవంతమైన పనిని నేర్చుకుంది. చాలా మంది భర్తలతో వంట చేయించాలనుకుంటారు. కానీ సామ్ మాత్రం తానే వండి రుచికరమైన వంటకాల్ని చైతూకి తినిపించాలనుకుంటోంది. ఇంకా చెప్పాలంటే మజిలీలో వైఫ్ లా పద్ధతి తెలిసిన ఒద్దికైన భార్యగా తనను తాను ఆవిష్కరించుకోవాలనుకుంటోంది.ఈ తీరిక సమయంలో వంటలపై రకరకాల ప్రయోగాలు చేసింది. అందుకోసం శిక్షణ కూడా తీసుకుంది. ఆ సంగతిని తన ఇన్ స్టా పోస్లింగులు బహిర్గతం చేశాయి. సామ్ నగరంలోని ప్రసిద్ధ ఆహార నిపుణుడిని తన కోచ్ గా నియమించుకుంది. ఆరోగ్యకరమైన జీవనం కోసం కొన్ని ప్రత్యేక వంటకాలను నేర్చుకోవడమే గాక... కొన్ని సూప్ ల తయారీ నేర్చుకుందట.

ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆకు కూరల పంటను పెంచుతున్న సమంత వాటితో అత్యుత్తమమైన.. రుచికరమైన వంటకాన్ని చేయాలని నిర్ణయించుకుందిట. పాస్తా.. షక్షుకా అంటూ చాలా వంటలపై ప్రయోగాలు చేసిన సామ్ ఇన్ స్టాలో వాటిని షేర్ చేసింది. కొన్నిటిని ఎలా వండాలో పుస్తకంలో రాసుకుని మరీ.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని ప్రయత్నించింది. అన్నట్టు .. సామ్ ప్రస్తుతం వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉంది. మజిలీ తర్వాత మరోసారి చైతూతో కలిసి నటించేందుకు ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తమిళంలోనూ ఓ సినిమా చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో కీలక పాత్రలోనూ నటించింది.