Begin typing your search above and press return to search.

SSMB28 మరో బ్రేక్.. మహేషన్న గురించి తెలిసిందేగా!

By:  Tupaki Desk   |   1 April 2023 9:20 AM GMT
SSMB28 మరో బ్రేక్.. మహేషన్న గురించి తెలిసిందేగా!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పల్నాడు బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రేక్షకులకు అందించారు. మహేష్ పెద్దగా మార్పు ఏమి లేకుండా రెగ్యులర్ లుక్ లోనే కనిపిస్తున్నట్లుగా పోస్టర్ బట్టి తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి మహేష్ బాబు రెండు వారాలు పాటు గ్యాప్ ఇస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

మూవీ సినిమా రిలీజ్ డేట్ సంక్రాంతి ఖరారు కావడంతో కావాల్సిన అంత టైం షూటింగ్ కోసం కేటాయించవచ్చు. రాజమౌళి సినిమా షూటింగ్ కూడా మార్చి, ఏప్రిల్ లో ప్రారంభం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు తన రెగ్యులర్ ఫ్యామిలీ సమ్మర్ వెకేషన్ ని ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

రెండు వారాలపాటు మూవీ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా షూటింగ్ లో ఉన్న కూడా కచ్చితంగా సమ్మర్ వచ్చిందంటే రెండు వారాలు పాటు షూటింగ్ వాయిదా వేసేసి ఫ్యామిలీతో కలిపి ఏదో ఒక దేశానికి వెకేషన్ వెళ్తారు. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడంలో మహేష్ బాబు ముందు ఉంటాడు.

ఈసారి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ జరుగుతున్న కూడా దానికి రెండు వారాల గ్యాప్ ఇచ్చి తన ఫ్యామిలీ టైమ్ ని యుటిలైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరల త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.