బ్రేక్ తప్పదంటున్న మహేష్

Thu Jan 09 2020 16:42:06 GMT+0530 (IST)

Mahesh will take a three month break after Sarileru Neekevvaru

ప్రతీ సినిమా కు దాదాపు ఏడాది టైం తీసుకునే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' ను మాత్రం జస్ట్ ఐదు నెలల్లోనే పూర్తి చేసి థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను 'మహర్షి'ని ఫినిష్ చేసిన రెండు నెలలకి సెట్స్ పైకి తీసుకొచ్చిన మహేష్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాకు కూడా అంతే టైం తీసుకోనున్నాడు. మహర్షి షూటింగ్ అవ్వగానే ఫ్యామిలీ తో ట్రిప్ వేసుకొచ్చాడు.నెక్స్ట్ వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు మహేష్. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఎప్పటిలాగే రెండు మూడు నెలలు బ్రేక్ తీసుకోనున్నట్లు తెలిపాడు. తన ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్న సూపర్ స్టార్ ఆ టూర్ పూర్తయ్యాకే వంశీతో చేయబోయే సినిమాను స్టార్ట్ చేస్తాడు.

'సరిలేరు నీకెవ్వరు' మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మహేష్. అనిల్ కామెడీ  ప్రేక్షకులను  మేజిక్ చేస్తుందనే నమ్మకంతో  ఉన్నాడు. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా మరో డిసప్పాయింట్ సినిమాగా నిలుస్తుందా చూడాలి. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు.