త్రివిక్రమ్ ను అంత తిప్పించుకోవాలా మహేష్?

Tue Jul 05 2022 05:00:01 GMT+0530 (IST)

Mahesh should turn Trivikram so much?

సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే అందరికంటే ఎక్కువగా దర్శకుడికి మంచి గుర్తింపు లభిస్తుంది. అతనితో సినిమా చేయాలి అని హీరోలు వెంటపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకులకు మంచి డిమాండ్ అయితే ఉంది.అందుకే స్థాయిని తగ్గించుకొని మరి చాలామంది హీరోలు సక్సెస్ లో ఉన్న దర్శకులను ఎట్రాక్ట్ చేసేందుకు చూస్తున్నారు. ఇక మహేష్ బాబు ఆ విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు అనే చెప్పాలి. ఏ దర్శకుడు సక్సెస్ అందుకున్న కూడా మహేష్ వారికి అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు.

అయితే అల.. వైకుంఠపురములో.. సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని దాదాపు నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన త్రివిక్రమ్ తో మాత్రం మహేష్ బాబు అంత ఈజీగా సినిమా చేసేందుకు ఒప్పుకోవడం లేదు. కమర్షియల్ దర్శకులు అనిల్ రావిపూడి అలాగే పరుశురామ్ తో సింగిల్ సెట్టింగ్ లోనే సినిమా చేయడానికి ఒప్పుకున్న సూపర్ స్టార్ ఎంతో అనుభవం ఉన్న త్రివిక్రమ్ తో మాత్రం సినిమా చేసేందుకు చాలాసార్లు తిప్పించుకోవాల్సి వచ్చింది.

గత ఏడాది నుంచి మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ అయితే త్రివిక్రమ్ మారుస్తూనే ఉన్నాడు. ఒకసారి దుబాయిలో కలిసిన త్రివిక్రమ్ ఇటీవల మహేష్ బాబు అమెరికా వెళ్తే అక్కడికి కూడా వెళ్లి కథ చెప్పాడు. ఇక ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చినా కూడా ఫైనల్ నెరేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు.

ఒక విధంగా మహేష్ బాబు స్క్రిప్ట్ విషయంలో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అని అర్థమవుతోంది. గతంలో శ్రీకాంత్ అడ్డాల మీద నమ్మకంతో బ్రహ్మోత్సవం సినిమా చేసిన మహేష్ మళ్ళీ అలాంటి పొరపాటు చేయకూడదు అని బౌండెట్ స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైన తర్వాతనే సెట్స్ పైకి వెళ్లేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ఇక త్రివిక్రమ్ ఇటీవల మొత్తానికి పూర్తి కథతోనే మెప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తారని అని సమాచారం.