యూఎస్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మహేష్!

Fri May 13 2022 13:00:00 GMT+0530 (IST)

Mahesh shakes US box office!

సూపర్ స్టార్ మహేష్ ఓవర్సీస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ హీరోలందరికన్నా రెట్టింపు ఇమేజ్ కల నటుడు. అందుకు అమెరికాలో మహేష్ సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతాయి. అంతకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ అదే స్థాయిలో జరుగుతుంది. టాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా వన్ మిలియన్ డాలర్ వసూళ్లకి పునాది వేసిన  ఘనత ఆయనకే సొంతం.అమెరికా మార్కెట్ లో మహేష్ ఏకంగా పదిసార్లు మిలియన్ డాలర్ల ఏకైక స్టార్ గా నిరూపించుకున్నారు. ఈ విషయంలో మహేష్ ని బీట్ చేసే నటుడు లేడనే చెప్పాలి. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ సైతం మహేష్ తర్వాతనే అనాలి. తాజాగా 'సర్కారు వారి పాట'తో సూపర్ స్టార్ దూకుడు యధావిధిగా కొనసాగుతుంది.

ఓవర్సీస్ లో తెలుగు రీజినల్ మూవీస్ లలో  ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త షాక్ ఇచ్చిన 'సర్కారు వారి పాట' ఇక ప్రీమియర్ షోలో కలెక్షన్లతో  ఎవరూ ఊహించని రికార్డును సొంతం చేసుకుంది. ఒక్క ప్రీమియర్ నుంచే $ 925 కె వసూళ్లతో సంచలనం సృష్టించింది. గురువారం ఒక్కరోజే ప్రీ సేల్స్ తో వన్ మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది.

దీంతో సూపర్ స్టార్ ఖాతాలో ఎస్ వీపీ పదకొండవ మిలియన్ డాలర్ల చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకూ ఏడు మిలియన్ డాలర్ల వసూళ్ల తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ముందజలో ఉండేవాడు. ఆ నంబర్  ని  ఇటీవలే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' క్రాస్ చేసింది. ఇప్పుడు మహేష్ సినిమా వాటి సరసన నిలిచింది.

ఇదంతా ఓపెనింగ్ డే కథ. ఇకపై మహేష్ సిసలైన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. సినిమాకి టాక్ డివైడ్ గానే  వచ్చింది. రివ్యూలు ఆశాజనకంగా లేవు.  సినిమాకి అన్నివైపులా పాజిటివ్ వైబ్స్ కనిపించలేదు. మరి మహేష్ ఛరిష్మాతోనే థియేటర్ కి రప్పించాల్సి ఉంటుంది.

ఇక ఏపీ- తెలంగాణలో అయితే మహష్ దూకుడు కొన్ని రోజుల పాటు కనిపిస్తుంది. తొలి రోజు ఈ రెండు  ఏరియాల నుంచి భారీ వసూళ్లే సాధించింది.