Begin typing your search above and press return to search.

అయ్య బాబోయ్.. మహేష్ ఏంటి రోజు రోజుకి ఇలా మారిపోతున్నాడు...!

By:  Tupaki Desk   |   27 May 2020 4:30 PM GMT
అయ్య బాబోయ్.. మహేష్ ఏంటి రోజు రోజుకి ఇలా మారిపోతున్నాడు...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనేది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్య మహేష్ లుక్ లో చాలా చేంజ్ వచ్చింది. మరీ చిన్నపిల్లాడిలా టీనేజీ అబ్బాయిలా మారిపోతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇప్పుడు మహేష్ ని చూస్తే అసలు ఈయన వయసు పెరుగుతుందా.. తగ్గుతుందా అనే అనుమానం రాకమానదు. మహేష్ బాబు ప్రస్తుత వయసు 46.. కానీ ఈయన్ని చూస్తుంటే 20 ఏళ్ల లోపే ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటి సినిమా నుండి ఇప్పటికీ అదే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పుడు ఇంట్లోనే ఉండటంతో మరింత యంగ్ గా అయిపోయాడు సూపర్ స్టార్. తన కొడుకు గౌతమ్ కి బ్రదర్ లా అనిపిస్తున్నాడు.

ఇప్పుడు తాజాగా మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పిక్ చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేరు. కూతురు సితారతో అద్దం దగ్గర నిల్చొని మహేష్ దిగిన మిర్రర్ సెల్ఫీ అయితే మరింత పిచ్చెక్కిస్తుంది. ఇందులో ఈయన సితారకే అన్నయ్యలా ఉన్నాడంటే అతిశయోక్తి కాదేమో. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మహేష్ అన్నం తింటున్నాడా.. అందం తింటున్నాడా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఈయన వయసు దాచుకునే యంత్రమేమైనా కనిపెట్టడా.. అందుకే ఇలా రోజురోజుకీ యంగ్ గా అయిపోతున్నాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు స్టార్ హీరోగా బిగ్ స్క్రీన్ పై ఎంత గొప్పగా కనిపించినా కూడా తన ఇంట్లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మహేష్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడంలో సరిలేరు నాకెవ్వరూ అంటూ సరదాగా గడిపేస్తున్నాడు. షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీని ఏ మాత్రం మిస్ అవ్వడు అనే విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా తన ఫ్యామిలీ మెంబర్స్ ని వెంటపెట్టుకొని వెళుతుంటారు. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్న మహేష్ కొడుకు కూతురి కోసం మరీంత సమయాన్ని కేటాయించి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ బాబుకి తన గారాల కూతురు సితార అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. రోజుకో ఫోటోతో ఇద్దరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా మిర్రర్ సెల్ఫీతో ముందుకొచ్చారు ఈ తండ్రీకూతురు.