ప్రైమ్ లో SVP డేట్ ఫిక్స్ చేసిన మహేష్!

Tue May 24 2022 10:00:28 GMT+0530 (IST)

Mahesh fixes SVP date in Prime

`సర్కారు వారి పాట`తో సూపర్ స్టార్ మహేష్ మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. `భరత్ అనే నేను`..`మహర్షి`...`సరిలేరు నీకెవ్వరు` రేంజ్ హిట్ కాకపోయినా వచ్చిన వసూళ్లతో అంతా హ్యాపీ. ఇటీవలే సినిమా సక్సెస్ మీట్ ని కూడా యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది.ఆ వేడుకలో సినిమా పంపిణీదారులు సైతం పాల్గొని సంతోషం వ్యక్తం చేసారు. నిజంగా సినిమా సక్సెస్ అయితేనే డిస్ర్టిబ్యూటర్లు ఆ స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తారు. సినిమా ఆ స్థాయి విజయాన్ని అందుకోకపోతే అంత గ్రాండ్ గా వేడుక నిర్వహించరు. పంపిణీదారులు పాల్గొనడానికి అవకాశం ఉండదు. వసూళ్ల పరంగా సినిమా అధికారిక లెక్కల్లో కాస్త క్లారిటీ లోపించినప్పటికీ నష్టాతే తే రాలేదు.

వికీ పీడియా సమాచారం మేరకు సినిమా 150 కోట్లకు పైగానే వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే సర్కారు వారి పాటని బ్లాక్ బస్టర్ ఖాతాలోనే వేయాలి. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. జూన్  24 నుంచి ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఓటీటీ రూల్స్ ప్రకారమే సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

ఆరు వారాల కన్నా ముందుగానే సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే బిగ్ స్ర్కీన్ సక్సెస్ పై అనుమానాలు వ్యక్తం అయ్యేవి. కానీ ఆ ఛాన్స్ లేకుండానే మహేష్ ఓటీటీలోకి వస్తున్నాడు కాబట్టి సందేహమేమి లేదని చెప్పొచ్చు. థియేట్రికల్ రిలీజ్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీలో పెద్ద సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓటీటీలో ప్లాప్ సినిమాలే టైంపాస్ చిత్రాలుగా రాణిస్తున్నాయి.

అలాంటిది  మహేష్ సినిమా కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీలో పెద్ద సక్సెస్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకే కొనుగోలు చేసింది. మహేష్ ఛరిష్మాతో ఆ లెక్కని వీజీగానే క్రాస్ చేయగలదని తెలుస్తుంది.  ఇటీవల రిలీజ్ అయిన ఆచార్య కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

అలాగే రాధేశ్యామ్ పరిస్థితి అంతే. `ఆర్ ఆర్ ఆర్` ఒక్కటే ఓటీటీలో సక్సెస్ అయింది. ఇప్పుడు  డివైడ్ టాక్ తో వచ్చిన సర్కారు వారి పాట ఆ కోవలో నిలుస్తుందని  అంచనా వేస్తున్నారు. మరి  ఓటీటీ లో ఎస్ వీపీ  రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.