రేస్ కోసం ఎదురుచూస్తున్న మహేష్

Wed Jan 25 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Mahesh babu tweet FormulaE race hyderabad

సూపర్ స్టార్ మహేష్ బాబు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంత అందంగా ఉంటారో... మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ముందుండే మహేష్ బాబు... తాజాగా హైదరాబాదులో జరిగిన ఈ రేస్ పై స్పందించారు.భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ మన హైదరాబాద్లో జరుగుతుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ రేస్... ఇప్పటికే టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఈ టికెట్లను బుక్ మై షో లో రిలీజ్ చేశారు. వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 2500 టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే తాజాగా ఈ రేస్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ కోసం మహేష్ బాబు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక మహేష్ బాబుకి మంత్రి కేటీఆర్ కి మధ్య చక్కటి అనుబంధం అయితే ఉందని చెప్పవచ్చు. భరత్ అనే నేను సినిమా మంత్రి కేటీఆర్ ను స్పూర్తిగా తీసుకొని చేశారని అప్పట్లో అయితే చర్చ జరిగింది. వీరి మధ్యన అయితే మంచి స్నేహం ఉందని చెప్పవచ్చు. ఆ మధ్య ఒకటి రెండు ఆడియో ఫంక్షన్ లకు కూడా మంత్రి కేటీఆర్ హాజరయ్యాడు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది ఇది పూర్తయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమాను చేయనున్నాడు. ఇది వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంటుందని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చూడాలి ఇక. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.