Begin typing your search above and press return to search.

సూపర్ లుక్ : ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న మహేష్‌ లుక్‌

By:  Tupaki Desk   |   14 Aug 2022 8:56 AM GMT
సూపర్ లుక్ : ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న మహేష్‌ లుక్‌
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు వయసు పెరుగుతున్నా కొద్ది యంగ్ గా కనిపిస్తున్నాడు. సినిమా సినిమా కు ఆయన యొక్క లుక్‌ మరింత స్టైలిష్ గా కనిపిస్తూ ఉంది. తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన లుక్ ఇది.

మహేష్‌ బాబు స్వయంగా ఈ ఫోటోను షేర్‌ చేశాడు. లవ్వింగ్ ది న్యూ వైబ్‌ అంటూ మహేష్ బాబు షేర్‌ చేసిన ఈ ఫోటో ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మామూలుగా అయితే మహేష్ బాబు గడ్డం తో ఎక్కువగా నటించింది లేదు. ఆమధ్య మహర్షి లో కాస్త గడ్డం లుక్‌ లో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మళ్లీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 28 లో గడ్డంతో కనిపించబోతున్నాడు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా కూడా మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు. మహేష్ న్యూ లుక్‌ కు ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఇప్పటి నుంచి అభిమానులు ఎదురు చూడటం మొదలు పెట్టారు. మహేష్‌ బాబు త్రివిక్రమ్ ల కాంబో సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.

గతంలో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో అతడు మరియు ఖలేజా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. అయితే టీవీ లో టెలికాస్ట్‌ అయిన ప్రతి సారి కూడా మంచి రేటింగ్ ను ఆ రెండు సినిమాలు కూడా దక్కించుకున్నాయి. ఇన్నాళ్ల తర్వాత మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.