మహేష్.. ఈ టూర్ అంత స్పెషలా?

Tue May 21 2019 09:46:31 GMT+0530 (IST)

Mahesh babu Going to Vacation With His Family

సూపర్ స్టార్ మహేష్ తన సినిమాల రిలీజ్ లకు ముందు రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో వెకేషన్ కి వెళుతుంటారన్న సంగతి తెలిసిందే. షూటింగులతో పని లేకుండా.. తీరిక సమయాలు చిక్కితే కుటుంబ సమేతంగా విదేశాల్లో జాలీ ట్రిప్ లు వేస్తుంటారు. మహర్షి రిలీజ్ కి ముందు ఓసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్లి వచ్చారు. ప్రస్తుతం మహర్షి సక్సెస్ ఆనందం మహేష్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ హ్యాపీ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకునేందుకు మరోసారి నమ్రత సహా విదేశీ టూర్ కి వెళుతున్నామని ప్రకటించారు మహేష్.ఈ ట్రిప్ లో మాష్టర్ గౌతమ్.. బేబి సితార కూడా సమ్మర్ సెలవుల్ని ఎంజాయ్ చేయబోతున్నారు.  సోమవారం నాడు విదేశాలకు బయలుదేరారు. ఇటీవల మహర్షి ప్రమోషన్ పేరుతో బాగా స్ట్రెస్ అయిన మహేష్ ఈసారి సుదీర్ఘంగానే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్తున్నారు. ఈ టూర్ గురించి చెబుతూ మహేష్ ఒక ఫొటోను ట్వీట్ చేశారు.

``మరో మరపురాని హాలీడేకు వెళ్తున్నాం. ఇది చాలా ప్రత్యేకం.. సెలబ్రేటింగ్ మహర్షి`` అని వ్యాఖ్యను పోస్ట్  చేశారు. మహర్షి చిత్రానికి ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చినా ఈ సీజన్ లో పోటీ సినిమా లేకపోవడం కొంతమేర బాక్సాఫీస్ వద్ద కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండస్ట్రీ రికార్డుల్ని బద్ధలు కొడుతుందా లేదా? అన్నది అటుంచితే మహేష్ కెరీర్ బెస్ట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ టూర్ ముగించుకున్న తర్వాత జూన్ లో అనీల్ రావిపూడి తో సినిమాని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వేగంగా పూర్తవుతోంది. కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ దర్శకుడు అనీల్ రావిపూడి - అనీల్ సుంకర బృందం బిజీగా ఉన్నారు. ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నారు. మహేష్ 26లో ఓ యువహీరో నటిస్తారని ప్రచారం సాగుతోంది.