Begin typing your search above and press return to search.

మహేష్ కారం.. పవన్ పొగరు కలిస్తే

By:  Tupaki Desk   |   1 Jun 2023 1:18 PM GMT
మహేష్ కారం.. పవన్ పొగరు కలిస్తే
X
పెద్ద హీరోల సినిమాలు అంటే అభిమానులకు పండగే. అది కూడా పండగ సీజన్ లో వస్తే నిర్మాతలకు కాసుల వర్షం కురవడం ఖాయం. మంచి కంటెంట్ తో సినిమా ఉంటే ఫ్యాన్స్ ఖుషీ అవ్వడం కూడా ఖాయమే. ఇప్పుడు అలాంటి పండగే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. అర్థం కాలేదా..? టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకేసారి తమ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. మరో వైపు మహేష్ గుంటూరు కారం షూటింగ్ లో ఉన్నారు. ఇటీవల పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదల చేయగా, అవి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవన్ మాస్ లుక్ లో అదరగొట్టారు. ఇది తేరీ మూవీకి రిమేక్ అయినప్పటికీ, ఆ ఛాయలేమీ కనపడకుండా జాగ్రత్తపడటం విశేషం.

అప్పటి వరకు ఈ మూవీ విషయంలో డైరెక్టర్ ని వాయించిన ఫ్యాన్స్ కూడా గ్లింప్స్ చూశాక నోరెళ్ల పెట్టారు. ఇంత బాగుంది ఏంటన్నా అంటూ హరీష్ శంకర్ కి మెసేజ్ లు కూడా పెట్టారు. గ్లింప్సే ఇంత బాగున్నాయి అంటే, ఇక సినిమా ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు

ఇక మహేష్ విషయానికి వస్తే, ఆయన గుంటూరు కారంతో రెడీ అయ్యారు. మహేష్ ఎంతో ఈజ్ తో చేయగల పాత్ర ఇది అని చూస్తుంటే అర్థమౌతోంది. మాస్ లుక్ లో మహేష్ ఫోటో కూడా తాజాగా విడుదల చేయగా, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. టైటిల్ తో పాటు విడుదల చేసిన మహేశ్ బాబు గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

ట్విట్టర్ లో పంచుకున్న టైటిల్ పోస్టు కేవలం గంట వ్యవధిలో 50 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ వ్యూస్ ని బట్టి, మూవీ కి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయట. ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్స్ పూర్తి చేసుకుంటే, ఈ రెండు మన తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు కనుక ఒకేసారి వస్తే నిజంగా ఇది పండగే అవుతుంది. మహేష్ కారం, పవన్ పొగరులో ఎది సత్తా చాటుతుందో, సంక్రాంతి అల్లుడుగా ఎవరు నిలుస్తారో తెలుస్తుంది.

అయితే, ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలు తమ మూవీ రిలీజ్ డేట్ విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది అని మాత్రం తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.