మహేష్.. పక్కా ఊరమాస్ క్యారెక్టర్!

Fri Oct 07 2022 18:11:13 GMT+0530 (India Standard Time)

Mahesh a perfect Mass character

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ ఇంకా సగానికి చేరుకోక ముందే అప్పుడే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు పాత్ర గురించి రోజు రోజుకు గాసిప్స్ సంఖ్య కూడా పెరుగుతుంది.అసలు మహేష్ బాబును త్రివిక్రమ్ ఎలాంటి బాడీ లాంగ్వేజ్ తో చూపిస్తాడు అనేది కూడా ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ముందుగా చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం నెవర్ బిఫోర్ అనే పాత్రలోనే మహేష్ బాబు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే రీసెంట్ గా మహేష్ బాబు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని కూడా ఒక టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని మళ్ళీ లేటెస్ట్ గా మరొక సీక్రెట్ సమాచారం అయితే అందుతుంది.

మహేష్ బాబు కాస్త కామెడి టైమింగ్ తో పాటు మంచి యాక్షన్ బాడీ లాంగ్వేజ్ తో కూడా ఈ సినిమాలో కనిపిస్తాడట. అంతేకాకుండా పక్క ఊర మాస్ క్యారెక్టర్ అని ఫస్ట్ అఫ్ మొత్తం అలానే ఉంటుందని తెలుస్తోంది. అయితే సర్కారు వారి పాట సినిమాలో కూడా ఇదే తరహాలో ఊర మాస్ క్యారెక్టర్ అని చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా విడుదలకు ముందు బాగా హైలెట్ చేశారు. ఫ్యాన్స్ కూడా అప్పుడు భారీ ఆశలు పెట్టుకున్నారు.

కానీ విడుదల తర్వాత మాత్రం ఆ రేంజ్ లో అయితే క్యారెక్టర్ క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ మాత్రం తప్పనిసరిగా మహేష్ బాబును పక్క ఊరమస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా హైలెట్ అవుతాయని అంటున్నారు.

అలాగే మహేష్ బాబుతో ఇంట్రడక్షన్ సాంగ్ కూడా సినిమాలో మరొక హైలెట్ అవుతుంది అని కూడా చెబుతున్నారు. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా ఫస్ట్ లుక్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక మహేష్ బాబుకి జోడిగా సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.