రెమ్యునరేషన్ తో పాటుగా లాభాల్లో వాటా తీసుకోనున్న త్రివిక్రమ్..?

Fri May 07 2021 14:00:01 GMT+0530 (IST)

Mahesh Takes Remuneration While Trivikram Enjoys Profits!

సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూకుడు మీదున్న మహేష్ - 'అల వైకుంఠపురములో' వంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాను నటించే సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ ప్రాఫిట్స్ షేర్ చేసుకునే మహేష్.. ఈ సినిమాకు కేవలం రెమ్యూనరేషన్ మాత్రనే తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ చొరవతో 60 కోట్ల దాకా పారితోషికం తీసుకోడానికి మహేష్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం '#SSMB28' కోసం రెమ్యూనరేషన్ తో పాటుగా లాభాల్లో కూడా వాటా తీసుకోనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా సుమారు 25 కోట్ల వరకు పారితోషకంగా అందుకోనున్న త్రివిక్రమ్.. సినిమా ప్రాఫిట్స్ లో కూడా అధిక భాగం తీసుకోనున్నారట. ఇకపోతే ఈ చిత్రానికి ''పార్థు'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది ద్వితీయార్థంలో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. 'అతడు' 'ఖలేజా' తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని 2022 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.