మహేష్ SSMB28.. ఇలా లీకులిస్తే ఎలా?

Tue Jan 31 2023 13:38:20 GMT+0530 (India Standard Time)

Mahesh SSMB28. Leaks like this?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ - మహేష్ ల కలయికలో వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని గత కొన్ని నెలలుగా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.ముందు కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివుల నేతృత్వంలో భారీ యాక్షన్ ఘట్టాలతో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. అయితే ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం ఆ యాక్షన్ ఎపిసోడ్ ని పక్కన పెట్టేశారట. ఇప్పుడు కూడా యాక్షన్ ఘట్టాల నేపథ్యంలోనూ షూటింగ్ ని మొదలు పెట్టినా వాటికి రామ్ లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఫిబ్రవరి ఎండ్ వరకు నాన్ స్టాప్ గా షూట్ జరగనుందని తెలిసింది.

చాలా ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ మహేష్ ల కలయికలో వస్తున్న సినిమా కవడంతో ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వున్నారట. అతడు ఖలేజా వంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడవ సారి కలిసి పని చేస్తున్న మహేష్ త్రివిక్రమ్ ఈ మూవీతో ఎలాంటి సర్ ప్రైజ్ ని ఇవ్వబోతున్నారా? అని అభిమానులు ఆసక్తిగా  ఎదురు చూస్తున్నారట. అయితే వారిని వరుస లీకులు మాత్రం కలవరానికి గురి చేస్తున్నాయి.

ఈ మూవీ ఆన్ లొకేషన్ కు సంబంధించిన పలు ఫొటోలు వీడియో నెట్టింట వైరల్ గా మారడం తెలిసిందే. తాజాగా మరో ఫొటో వీడియో నెట్టింట లీకై వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రమాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల సెట్ లో త్రివిక్రమ్ మహేష్ లతో యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చర్చిస్తున్న ఓ స్టిల్ వీడియో నెట్టింట లీక్ అయింది. మెరున్ కలర్ చెక్స్ షర్ట్ బ్లాక్ ప్యాంట్.. క్యాజువల్ సైండిల్స్ ధరించి తనకు రెడ్ కలర్ రిబ్బన్ తో కనిపిస్తున్న మహేష్ లుక్ ఆకట్టుకుంటోంది.

అయితే ఇలా ప్రతీదీ నెట్టింట లీక్ అయిపోతే ఎలా అని ఫ్యాన్స్ చిత్ర బృందం పై ఫైర్ అవుతున్నారట. సిబ్బంది ప్రమోయం లేకుండా ఎలాంటి ఫొటో వీడియో లీక్ అయ్యే ఛాన్స్ లేదని ఈ విషయంలో సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట. ఇదిలా వుంటే లీకైన మహేష్ స్టిల్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.