Begin typing your search above and press return to search.

మ‌హేష్ - రాజ‌మౌళి బ‌డ్జెట్ 500 కోట్లుపైనే!

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 AM GMT
మ‌హేష్ - రాజ‌మౌళి బ‌డ్జెట్ 500 కోట్లుపైనే!
X
'బాహుబ‌లి' ప్రాంచైజీ స‌క్సెస్ తో రాజ‌మౌళి సినిమా బ‌డ్జెట్ అంత‌కంత‌కు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. 'బాహుబ‌లి ది బిగినింగ్'కి 180 కో ట్లు ఖ‌ర్చు చేసారు. అటుపై క‌న్ క్లూజ‌న్ కి అద‌నంగా 70 నుంచి 100 కోట్లు కేటాయించారు. మొత్త‌గా బాహుబ‌లి రెవండ‌వ భాగానికి అయిన ఖ‌ర్చు 250 కోట్ల‌కు పైగానే వెచ్చించారు.

సినిమా క్వాలిటీ..గ్రాండియ‌ర్ లుక్..విజువ‌ల్ గా హైలైట్ చేయ‌డం కోసమే డ‌బ్బుని మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసారు. ఇక 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి 400 కోట్ల‌కు గాపైగానే వెచ్చించారు. బాక్సాఫీస్ లెక్క‌ల్ని అంచ‌నా వేసుకుంటూ రాజ‌మౌళి బ‌డ్జెట్ గ్రాఫ్ అలా పెరుగుతూ పోతుంది త‌ప్ప‌..త‌గ్గ‌డానికి ఛాన్స్ ఎక్క‌డా లేదు.

రెండు చిత్రాలు భారీ కాన్సాస్ పై తెర‌కెక్క‌డంతోనే ఆ స్థాయి లో బ‌డ్జెట్ కేటాయించాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తుద‌ప‌రి సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమా కోసం కేటాస్తున్న‌? బ‌డ్జెట్ ఎంత అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బాహుబ‌లి..ఆర్ ఆర్ఆ ర్ చిత్రాల బ‌డ్జెట్ ని మించి ఖ‌ర్చు చేస్తార‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

పాన్ ఇండియా వ్యాప్తంగా మ‌హేష్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్.. క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని తీయాల్సిన సినిమా. పైగా ఆఫ్రియ‌న్ అడ‌వుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ. సెట్స్ నిర్మాణం గానీ..రియ‌ల్ లోకేష‌న్ లో షూటింగ్ గానీ ప్ర‌తీది ఎంతో వాస్త‌వికంగా విజువ‌ల్ గా హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఇక రాజ‌మౌళి సినిమా అంటే ఎలాగూ విదేశీ సాంకేతిక నిపుణులు త‌ప్ప‌నిస‌రి.

సీజీ వ‌ర్క్ అంతా ప్ర‌ఖ్యాత కార్పోరేట్ కంపెనీల‌కే అప్ప‌గించాల్సి ఉంటుంది. భారీ కాన్వాస్ తప్ప‌నిస‌రి. మ‌రి ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న పాన్ ఇండియా చిత్రానికి రాజ‌మౌళి కేటాయించే బ‌డ్జెట్ ఎంతం? అంటే? అక్ష‌రాల 500 నుంచి 600 కోట్ల మ‌ధ్య‌లో ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే నిర్మాత‌గా కే.ఎల్ నారాయాణ ఖ‌రారు అయ్యారు.

అయితే ఇంత బ‌డ్జెట్ ఆయ‌నొక్క‌రే పెడుతున్నారా? భాగ‌స్వాముల్ని రంగంలోకి దించుతారా? అంటే అందుకు ఛాన్స్ ఉంద‌ని వినిపిస్తుంది. ఒక‌టి రెండు ఫ‌స్ట్ క్లాస్ నిర్మాణ సంస్థ‌ల్ని రంగంలోకి దించాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారుట‌. 'లైకా ప్రొడ‌క్ష‌న్స్' త‌ర‌హాలో నిర్మాణం మ‌ధ్య‌లో ఆర్ధిక ఇబ్బందులు త‌లెత్త‌కుండా భాగ‌స్వాముల్ని కూడా ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంద‌ని ఓ ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది.

సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత సినిమా నిర్మాణం పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇలా కొన్ని లెక్క‌లు బేరీజు వేసుకుని సీన్ లోకి కొత్త‌ నిర్మాణ సంస్థ‌ల్ని తెచ్చే ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. మ‌రి ఈ ప్రాజెక్ట్ లో మ‌హేష్ పెట్టుబ‌డి ఉంటుందా? అన్న‌ది ఓ మిస్ట‌రీగా క‌నిపిస్తుంది. మ‌హేష్ ప్ర‌తీ సినిమాలో వాటా తీసుకుంటారు. ఆయ‌న రెమ్యున‌ర‌నేష‌న్ నే పెట్టుబ‌డిగా పెట్టి..జీఎంబీ బ్యాన‌ర్ ని టైటిల్ కార్స్డ్ లో నిర్మాణ సంస్థ‌గా వేస్తు వ‌చ్చారు.

మ‌రి ఇప్పుడు రాజ‌మౌళి సినిమా విష‌యంలో ఎలాంటి అగ్రిమెంట్ తో ముందుకు వెళ్తారు? అన్న‌ది కీల‌కంగా మారింది. రాజమౌళి సినిమా అంటే క‌ర్త‌..క‌ర్మ‌..క్రియ అన్ని ఆయ‌నే అవుతారు. ప్ర‌తీ ప‌నిలోనూ ఆయ‌న భాగ‌స్వామ్యం ఉంటుంది. నిర్మాత పెట్టిన పెట్టుబ‌డి కంటే డ‌బుల్ ప్రాపిట్ ఆయ‌న ఖాతాలో చేరుతుంది.

ప్రాజెక్ట్ ముందే ఆ ర‌క‌మైన అగ్రిమెంట్ కుదురుతుంది. వ‌సూళ్ల‌లో వాటాకి హీరోకి ఛాన్స్ ఉండ‌దు. కానీ మ‌హేష్ విష‌యంలో ఏదైనా వెసులు బాటు ఉంటుందా? మ‌హేష్ కూడా జ‌క్క‌న్న నిబంధ‌న‌లే అనుస‌రించాల్సి ఉంటుందా? అన్న‌ది చూడాలి.