పోల్ రిపోర్ట్: మహేష్ - పవన్ కెరీర్లో బెస్ట్ మూవీస్...!

Tue Jan 19 2021 19:00:01 GMT+0530 (IST)

Mahesh Pawan Best Movies in Career

సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకోడానికి చాలానే కష్టపడ్డారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కలెక్షన్స్ అందుకునే రేంజ్ కి ఇద్దరూ ఎదిగారు. ఇప్పటి వరకు మహేష్ బాబు 26 సినిమాల్లో నటించగా.. పవన్ కళ్యాణ్ 25 చిత్రాల్లో నటించాడు. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని ప్లాప్ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'తుపాకీ డాట్ కామ్' మహేష్ - పవన్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఏవని భావిస్తున్నారని ఓ పోల్ నిర్వహించగా క్రింది విధంగా రిజల్ట్స్ వచ్చాయి.మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ మూవీ ఏదని 12 సినిమాలకు పోల్ పెట్టగా.. 'పోకిరి' చిత్రానికి ఎక్కువ మంది ఓటు వేశారు. పూరీ - మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పటికి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. అందుకే ఈ చిత్రానికి 26.38శాతం మంది ఓటు వేశారు. ఆ తర్వాత 23.27శాతం ఓట్లతో 'ఒక్కడు' రెండో స్థానంలో నిలిచింది. అలానే 'అతడు'(18.78%).. 'మురారి' (9.08%).. '1 నేనొక్కడినే'(7.36%) సినిమాలు తర్వాతి ప్లేస్ లో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ ఏదని భావిస్తున్నారని 4 సినిమాలకు పోల్ నిర్వహించగా అత్యధిక శాతం 'తొలిప్రేమ' చిత్రానికి ఓట్ వేశారు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మొత్తం పోలైన ఓట్లతో 54.48శాతం మంది మద్దతు తెలిపారు. తర్వాత స్థానాల్లో 'ఖుషీ'(31.85%).. 'అత్తారింటికి దారేది'(7.30%).. 'గబ్బర్ సింగ్'(6.37%) చిత్రాలు నిలిచాయి.