అన్నా చెల్లెళ్లు షాపింగ్ అనుకుంటే పప్పులో అడుగేసినట్టే!

Tue Nov 24 2020 21:20:50 GMT+0530 (IST)

Looks Like Brother And Sister Went For Shooping

సూపర్ స్టార్ మహేష్ వారసులు గౌతమ్ - సితార ఇటీవలే విదేశాలకు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో విదేశీ షికార్లు అస్సలు సాధ్యపడలేదు. కరోనా నుంచి అంతో ఇంతో రిలీఫ్ దొరకగానే మహేష్ కుటుంబ సమేతంగా దుబాయ్ కి షార్ట్ వెకేషన్ ప్లాన్ చేశారు.విదేశీ విహారం ముగించి తిరిగి మహేష్ షూటింగుకి రెడీ అవుతుంటే.. అన్నా చెల్లెళ్లు మాత్రం ఇలా షాపింగ్ కోసం బయటికి వచ్చారని భావిస్తున్నారా? ప‌్చ్.. అక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఆ ఇద్దరూ ఏం కొన్నారో కానీ మాస్క్ ధరించి కట్టుదిట్టమైన భద్రతతో వెళ్లారు. అలాగే అక్కడ ఎలక్ట్రానిక్ స్క్రీన్ పై భాష చూస్తుంటే అది దుబాయ్ టూర్ లో చేసిన షాపింగ్ అని అర్థమవుతోంది.

ఆ ఫోటోని ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తుంటే అది అన్నా చెల్లెళ్లు కాదని అర్థమవుతుంది. గౌతమ్ తో కలిసి సితార షాపింగుకి వెళ్లలేదు. గౌతమ్ లా కనిపిస్తున్న మహేష్ తో కలిసి షాపింగ్ చేసింది. అసలే ఊహించని మేకోవర్ తో మహేష్ .. గౌతమ్ కి అన్నయ్యలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గౌతమే అని డౌట్ పడేలా కనిపించారు మాస్క్ ధరించి గుర్తు పట్టలేనంతగా..!