Begin typing your search above and press return to search.

www టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

By:  Tupaki Desk   |   14 Jan 2021 8:04 AM GMT
www టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
X
దర్శకుడిగా మారిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ రూపొందించిన తాజా చిత్రం WWW (హూ,వేర్‌,వై). కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘118’ చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన గుహన్.. WWWతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ మూవీ టీజర్ ను ప్రిన్స్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్స్. సైబర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.

కేవీ గుమన్ కు ఇది రెండో చిత్రం. ఇందులో అదిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వి పి.రాజు దా‌ట్ల నిర్మిస్తున్నారు. సిమ‌న్ కె. కింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు.