సరిలేరు ఎఫెక్ట్..పంచ్ లు వేస్తున్న మహేష్

Thu Jan 09 2020 14:45:32 GMT+0530 (IST)

Mahesh Babu on about Sarileru Neekevvaru Movie

మహేష్ బాబును దూరంగా చూసేవారు అయినా.. మీడియా వారు అయినా కూడా ఆయన చాలా సైలెంట్ అని తక్కువ మాట్లాడుతాడు అనుకుంటారు. కాని అసలు విషయం ఏంటీ అంటే మహేష్ బాబు కాస్త ఎక్కువగానే మాట్లాడుతాడు.. ఇతరులపై చాలా పంచ్ లు వేస్తాడు అంటూ ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతూ ఉంటారు. మహేష్ బాబు గురించి ఆయనతో వర్క్ చేసిన వారు ఎంత చెప్పినా కూడా నమ్మాలనిపించేది కాదు. కాని ఇప్పుడు ఆయన తీరు మీడియా వారికి అర్థం అవుతుంది.ఒకప్పుడు సెట్స్ లో తోటి నటీనటులపైనే పంచ్ లు వేస్తూ మాట్లాడే మహేష్ బాబు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రమోషన్స్ సందర్బంగా మీడియా వారితో కూడా మాట్లాడుతూ పంచ్ లు వేయడం.. సరదాగా ఆట పట్టించినట్లుగా మాట్లాడటం చేస్తున్నాడట. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు పాత్ర చాలా జోవియల్ గా ఉంటుంది. అందరితో కలిసి పోయి సరదాగా ఉండే పాత్ర. ఆ పాత్రను చేసిన మహేష్ బాబు ఇప్పుడు ఆ పాత్ర తాలూకు ఛాయలతో నిజ జీవితంలో కూడా వ్యవహరిస్తున్నాడు అంటున్నారు.

సరిలేరు ఎఫెక్ట్ అయినా మరేదైనా కూడా మహేష్ బాబులోని ఈ మార్పు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటూ అభిమానులు మరియు మీడియా మిత్రులు అంటున్నారు. మహేష్ బాబు చాలా సరదాగా మాట్లాడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాని గత వారం రోజులుగా మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలో మహేష్ బాబు చాలా జోష్ గా సరదాగానే ఉంటున్నాడు. ఇదే కొనసాగాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.