బార్సిలోనాలో ఎవరీ యంగ్ బోయ్..!

Fri Oct 22 2021 19:00:02 GMT+0530 (IST)

Mahesh Babu new look goes viral

సూపర్ స్టార్ మహేష్ విదేశీ షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్నపాటి విరామంలో నమ్రత కిడ్స్ సహా విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం ఆన్ లొకేషన్ సర్కార్ వారి పాట చిత్రీకరణ సాగుతోంది. బార్సిలోనా నుండి వచ్చిన తాజా ఆన్-లొకేషన్ చిత్రంలో మహేష్ బాబు ఎప్పటిలాగే స్పెషల్ లుక్ తో కనిపిస్తున్నారు. పూర్తి స్లిమ్ గా మారిపోయి పర్ఫెక్ట్ ఫిట్ బాడీ తో పొడవాటి జుట్టుతో కాలేజ్ కుర్రాడిలా కనిపిస్తున్న ఫోటో వైరల్ గా మారింది. అతని స్టైల్ పై యూత్ ఒకటే ముచ్చటించుకుంటోంది. మహేష్ తన తదుపరి చిత్రం `సర్కారు వారి పాట`లో తన కెరీర్ బెస్ట్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ ఫోటో చూడగానే గౌతమ్ కృష్ణకు అన్నయ్యలా ఉన్నాడు! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి మహేష్ ని మరీ ఇంత స్లిమ్ గా ఎవరూ ఊహించలేదు. అతడు ఒక టీనేజర్ నే తలపిస్తున్నాడని అభిమానులు షాక్ లో ఉన్నారు.గత రెండు వారాలుగా మహేష్ అండ్ టీం `సర్కారు వారి పాట` కోసం బార్సిలోనా- స్పెయిన్‌లో అనేక కీలక సన్నివేశాలను.. యాక్షన్ ఎపిసోడ్ లను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ మెజారిటీ భాగం పూర్తయిన తర్వాత ఈ నెల చివరిలో మూవీ యూనిట్ హైదరాబాద్ కు తిరిగి రానుంది.

సర్కారు వారి పాటలో మహేష్ బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నటిస్తున్నారని కథనాలొస్తున్నాయి. తదుపరి ట్రైలర్ రాకతో మహేష్ క్యారెక్టరైజేషన్ పై క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన నాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్- జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 13 జనవరి 2022 న సినిమా విడుదల కానుంది.