క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ..?

Mon Jan 17 2022 21:05:51 GMT+0530 (IST)

Mahesh Babu in talks with Koratala Siva now

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు కొరటాల శివ లది క్రేజీ కాంబినేషన్ అని అనొచ్చు. ఇప్పటి వరకు వీరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ సూపర్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.మహేష్ - కొరటాల కలిసి చేసిన 'శ్రీమంతుడు' సినిమా భారీ వసూళ్లు రాబట్టమే కాదు.. సమాజంపై ఎంతో ప్రభావం చూపించింది. గ్రామాలను దత్తత తీసుకోవడం.. ప్రతి ఒక్కరూ పుట్టిన ఊరికి ఏదొకటి చేయాలనే మంచి సందేశం అందరినీ ఆలోచింపజేసింది. ఈ మూవీ స్పూర్తితో ఎంతోమంది పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అగ్ర దర్శకహీరోలిద్దరూ 'భరత్ అనే నేను' సినిమా కోసం మళ్ళీ కలిశారు. కొరటాల శివ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. వీరి కాంబినేషన్ కు తిరుగులేదని నిరూపించింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు - కొరటాల కలిసి మూడో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.  

మహేష్ బాబు హోమ్ ప్రొడక్షన్ GMB ఎంటర్టైన్మెంట్స్ లో ఈ ప్రాజెక్ట్ కోసం కొరటాల శివతో టాక్స్ ప్రారంభం అయ్యాయని.. యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ కూడా ఈ పాన్ ఇండియా సినిమా నిర్మాణంలో భాగం కానున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే రెండు విజయాలు అందించిన్నప్పటికీ.. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేయడాన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. అగ్ర దర్శకుడి వల్లే తమ ఫేవరేట్ హీరో సబ్టిల్ రోల్స్ కు పరిమితం అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మహేష్ దాన్నుంచి బయట పడేలా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారని.. ఇప్పుడు కొరటాలతో మరో సినిమా అంటే మళ్ళీ అదే దారిలోకి వెళ్తారేమో అని అంటున్నారు.

ఇకపోతే మహేష్ - కొరటాల శివ ఇద్దరూ ప్రస్తుతం వేర్వేరు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న మహేష్.. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - రాజమౌళి వంటి ఇద్దరు స్టార్ డైరెక్టర్లు తో వర్క్ చేయనున్నారు.

మరోవైపు కొరటాల శివ.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక అల్లు అర్జున్ తో దర్శకుడు ఓ ప్రాజెక్ట్ బాకీ ఉన్నారు. మరి ఈ క్రమంలో మహేష్ - కొరటాల కాంబోలో ఓ సినిమా ఉంటుందేమో చూడాలి.