'ఉప్పెన' కు సూపర్ స్టార్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్

Tue Feb 23 2021 08:27:11 GMT+0530 (IST)

Mahesh Babu congratulates team Uppena

వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అయిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విడుదలై రెండు వారాలు అయినా కూడా మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ముగ్గురు కొత్త వారే అయినా కూడా సినిమా ఒక రేంజ్ లో ఉంది అంటూ సినీ ప్రేమికులు అంటున్నారు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఉప్పెన సినిమాకు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. ఏకంగా ఉప్పెన సినిమాను క్లాసిక్ మూవీ అంటూ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి చిత్రం స్థాయిని మరింతగా పెంచాడు.మహేష్ బాబు వరుస ట్వీట్స్ తో ఉప్పెన సినిమా పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఒక అద్బుతమైన సినిమాను వెండి తెరకు పరిచయం చేశారు. ఉప్పెన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్ మూవీ. ఇండస్ట్రీలో బుచ్చి బాబు ఒక అరుదైన సినిమాను తీసుకు వచ్చాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. కథతో పోటీ పడే విధంగా సంగీతం ఉంది. నటీ నటుల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు మైత్రి వారికి సుకుమార్ గారికి హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో అభినందించారు. మహేష్ బాబు ట్వీట్ కు మైత్రి వారు.. దేవిశ్రీ ప్రసాద్.. దర్శకుడు బుచ్చి బాబు ఇతర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. కాస్త లేట్ స్పందించినా కూడా మహేష్ బాబు ఉప్పెన రియాక్షన్ తో సినిమా స్థాయి మరింత పెరిగిందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.