Begin typing your search above and press return to search.

రేర్ పిక్ : అమ్మమ్మతో మహేష్ బాబు

By:  Tupaki Desk   |   4 April 2020 5:19 AM GMT
రేర్ పిక్ : అమ్మమ్మతో మహేష్ బాబు
X
సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తన సినిమాలతో తెలుగు సినిమా రికార్డులను తిరగరాయటమే కాకుండా, తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియజేశాడు. తన యాక్టింగ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందంతో హాలీవుడ్ హీరోలను తలదన్నేలా ఉండే మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొడతాడు. ఒక్క చిన్న స్మైల్ తోనే ఆకట్టుకునే రూపం మహేష్ సొంతం. తన యాక్టింగ్ తోనే కాకుండా తన సింప్లిసిటీ, బెహేవియర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ సమానంగా లీడ్ చేస్తున్న అతి తక్కువ మందిలో మహేష్ ఒకరని చెప్పవచ్చు. ఫ్యామిలీకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ చూస్తే తెలిసిపోతుంది ఇది. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా అతని పిల్లలపై తను చూపించే శ్రద్ధ మహేష్ లోని గొప్ప తండ్రిని చూపిస్తుంది. వాళ్ల లైఫ్ మిస్సవ్వకుండా ఔటింగ్ లకు తీసుకెళ్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తుంటాడు. మహేష్ బాబుకి సంభందించిన అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఫొటోలో మహేష్ బాబు తన అమ్మమ్మతో టైం స్పెండ్ చేస్తున్నాడు. చిరునవ్వుతో పక్కన ఉన్న తన అమ్మమ్మ వైపు చూస్తూ ఉండే ఈ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు. ఇంకా సినిమాల విషయానికొస్తే సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తన కెరీర్లో 27వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. పరాశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.