మహేష్ బాబుకి 'స్పా' అంటే అంత ఇష్టమా..!

Sat Oct 31 2020 23:10:41 GMT+0530 (IST)

Does Mahesh Babu like 'spa' so much ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయస్సు దాటినా మహేష్ ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు. టాలీవుడ్ స్టార్ కాదు హాలీవుడ్ స్టార్ అనుకునే మెయింటైన్ చేస్తూ ఉంటాడు మహేష్. అందుకే మహేష్ కి ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మహేష్ అందానికి ఫిదా అయిపోయిన లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల మహేష్ సతీమణి నమ్రత పోస్ట్ చేస్తున్న ఫోటోలలో ఈ రాజకుమారుడి లుక్ చూస్తుంటే మరీ టీనేజర్ లా ఉన్నాడే అనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్టుగా నమ్రత ఇంస్టాగ్రామ్ లో మహేష్ కి సంబంధించిన మరో పిక్ షేర్ చేసింది. 'కమాలయ ఎఫెక్ట్! స్పాలో అడుగుపెట్టడం కంటే అతన్ని ఏమీ సంతోషంగా ఉంచవు'' అని పోస్ట్ పెట్టింది. ప్రీ కోవిడ్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసిన ఈ ఫోటో థాయిలాండ్ లోని కమాలయ లో తీసుకున్న పిక్ అని తెలుస్తోంది.కాగా మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గానే కాకుండా 'ఫ్యామిలీ మ్యాన్'గా కూడా పిలవబడుతుంటాడు. సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా.. సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటాడు. కెరీర్ ని ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తూ వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. తన ఇద్దరు పిల్లలు గౌతమ్ - సితారాలతో కలిసి ఆడుకోవడమే కాకుండా వాళ్ళని ఔటింగ్స్ కి తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తారు.