Begin typing your search above and press return to search.

ఎలా లీక్ అయింది.. మహేష్ అసహనం?

By:  Tupaki Desk   |   29 May 2020 7:45 AM GMT
ఎలా లీక్ అయింది.. మహేష్ అసహనం?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ప్రకటన మరో రెండు రోజుల్లో రానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మహేష్ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా #మహేష్27 కు పూజా కార్యక్రమాలు జరుగుతాయని.. అదే రోజు అభిమానులకు కానుకగా టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేయాలని పరశురామ్ టీమ్ ప్లాన్ చేసుకున్నారట. టైటిల్ ప్రకటనతో అభిమానులను థ్రిల్ చేయాలని అనుకుంటే అది కాస్తా ముందే లీక్ కావడంతో మహేష్ అప్సెట్ అయ్యారట.

'సర్కార్ వారి పాట' టైటిల్ ఖాయం అయిందని సమాచారం. ఐతే ముందే ఇది మీడియాకు ఎలా లీక్ అయిందని మహేష్ తన పీఆర్ టీమ్ పై అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెప్పారట. ఇప్పుడు టైటిల్ లీక్ అయిపోయింది కాబట్టి సినిమా టైటిల్ పోస్టర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారట.

పరశురామ్ ఈ సినిమాతో మొదటిసారిగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న భారీ మోసాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరస హిట్లతో జోరు మీద ఉండడంతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.