మహేష్ పై ఫ్యామిలీ లేడీస్ గుర్రుమీదున్నారా?

Fri May 13 2022 22:03:33 GMT+0530 (IST)

Mahesh Babu Sarkaru Vari Paata

సూపర్ స్టార్ మహేష్ పై ఫ్యామిలీ లేడీస్ గరంగరంగా ఉన్నారా? పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిన మహేష్ పెద్ద తెరపై ఆ బోల్డ్ సీన్ పండడం కోసం చేసిన సాహసం ఇప్పుడు అతడికి ఇబ్బందికరంగా మారుతోందా? అంటే అవుననే లేడీ ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది.మహేష్ నటించిన సర్కార్ వారి పాట ఇటీవలే విడుదలైంది. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ద్వితీయార్థంపై డివైడ్ టాక్ నడిచింది. అయితే ఈ మూవీలో ఓ డైలాగ్ గురించి ఓ బోల్డ్ సీన్ గురించి ఫ్యామిలీ లేడీస్ లో గుసగుస వేడెక్కించేస్తోంది. అసలు మహేష్ అలా చేసి ఉండాల్సింది కాదు! అంటూ తన డైహార్డ్ లేడీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. నిజానికి మహేష్ తనకు ఉన్న ఇమేజ్ ని మించి ఆ సీన్ లో నటించారు. కేవలం మాస్ ని ఆకట్టుకునేందుకు పరశురామ్ ఆ సీన్ డిజైన్ చేయడం దానికి అభ్యంతరం చెప్పక నటించేయడం ఇప్పుడు అతడిని చిక్కుల్లో పడేసిందన్న చర్చా సాగుతోంది.

ఇంతకీ అది ఏ సీన్ ? అంటే..ద్వితీయార్థంలో వస్తుంది. ``నా పక్కన పడుకున్న వ్యక్తిపై కాలు వేయకుండా రాత్రికి నిద్రపోలేను`` అని కీర్తి సురేష్ ని తన ఇంటికి రమ్మని అభ్యర్థిస్తాడు మహేష్. కీర్తి ప్రతి రోజు రాత్రి ఇంటికి వచ్చి అతని పక్కన పడుకుంటుంది. అతను తన కాలుని కీర్తిపై ఉంచుకుంటాడు. మాస్ లోని కొన్ని వర్గాలకు ఇది బాగా నచ్చేసినా కానీ మహేష్ మహిళా అభిమానులు మాత్రం చిన్నబుచ్చుకుంటున్నారు. ఈ సీన్ చేయాల్సింది కాదని వారిలో డిస్కషన్ సాగుతోంది.

మాస్ కి అదిరిపోయే ట్రీటివ్వాలన్న తపనతో మహేష్ ఈ సినిమాలో ఈ సన్నివేశం చేసినా కానీ వాస్తవంలో అతడి ఇమేజ్ కి అది సూట్ కాదన్న చర్చా సాగుతోంది. మహేష్ నిజజీవితంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్.. తెరపైనా అంతే ఆదర్శంగా కనిపించాలని కోరుకునే లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లనే ఈ చిక్కు. హీరోయిన్ తో రొమాన్స్ అవసరమే .. కానీ హద్దులు దాటకూడదని వారు భావిస్తున్నారు. అందువల్ల మునుముందు తాను చేసే సినిమాల్లో మహేష్ నాయికలతో రొమాన్స్ గురించి పదే పదే జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట.