పోస్టర్ వార్ పై మహేష్ ఎందుకిలా అనేశారు!

Sun Jan 26 2020 11:00:36 GMT+0530 (IST)

Mahesh Babu Reacts On Collection Poster War In His Style

సంక్రాంతి కానుకగా రిలీజైన సరిలేరు నీకెవ్వరు..అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. ఇరు చిత్రబృందాలు ఫేక్  వసూళ్ల పోస్టర్లతో  ఆధిపత్య పోరు చూపించుకునే ప్రయత్నం చేయడంపై ఆసక్తికర  కథనాలొచ్చాయి. ఒకరికి పోటీగా  మరొకరు థాంక్స్ మీట్లు...సక్సెస్ మీట్లు నిర్వహించడంతో సందేహం మరింత బలపడింది.  అంతిమంగా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి హీరో ఎవరన్నది లోగుట్టు కొందరికే తెలుసు. 150 కోట్లు.. 200 కోట్లు అంటూ ఆధారాలు లేని లెక్కల పోస్టర్లు వేసి ఒకింత అందర్నీ కన్ఫ్యూజన్  కి గురిచేయడంపై మాత్రం తీవ్ర  విమర్శలు వెల్లువెత్తాయి.సోషల్ మీడియాలోను పోస్టర్ వార్ పై ఓ రేంజులో షంటేయడం చర్చకొచ్చింది. నిజాల్ని వక్రించిన సినిమ వోళ్లు అంటూ ఆడేసుకున్నారు ఈ వేదికపై. దీనిపై సూపర్ స్టార్ మహేష్ ఏమనుకు న్నారో.. ఏమో  తెలియదు గానీ.. తాజాగా అతడు ఆసక్తికర కామెంట్లు చేశారు. ``మేం చీప్ ట్రిక్స్ నమ్మం. వేరే వాళ్ల గురించి నెగిటివ్ గా మాట్లాడటం తెలియదు. గెలుపు కోసం ఎప్పుడూ దొడ్డి దారిలో  వెళ్లలేదు. ఆ అవసరం నాకు లేదు. నేను ఏదీ సాధించినా అది నా హర్డ్ వర్క్ వల్లనే. మంచితనం.. కుటుంబ సహకారం ఎప్పుడూ ఉంటుంది. వీటన్నింటికి  మించి అభిమానుల బలం వల్లే ఇదంతా సాధింగచగలిగాను`` అంటూ ఫిలాసఫికల్ గా అన్నారు.

గతంలో మహేష్ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. మహర్షి సక్సెస్ అయిన సందర్భంగా థాంక్స్ మీట్ లో   కాలర్ ఎగరేసి అభిమానులు కూడా ఇలా కాలరెగరేసి గర్వపడే సినిమా  ఇది  అని ఉద్వేగంగా మాట్లాడారు. అప్పుడు కూడా మహర్షి వసూళ్లు  ఫేక్ అని కొన్ని రకాల  కథనాలు వైరల్  అయ్యాయి. కానీ అప్పుడు మహేష్ బాక్సాఫీస్ వద్ద సోలోగా వచ్చాడు. కానీ ఈసారి అతనికి బన్నీ  పోటీకొచ్చాడు. దీంతో వార్ తప్పలేదు. ఆ క్రమంలోనే మహేష్ ఇలా ఓపెన్ అవ్వాల్సి వచ్చిందన్న ఓ ప్రచారం అంతర్జాలంలో వేడెక్కిస్తోంది.