#మహేష్27: క్రిష్ కరెక్టేనా అరవింద్ గారూ?

Thu Nov 08 2018 16:13:50 GMT+0530 (IST)

Mahesh Babu Movie with Krish

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ కెరీర్లో 25 వ చిత్రం.  ఈ సినిమా పూర్తికాగానే #మహేష్26 సుకుమార్ దర్శకత్వంలో ఉంటుంది.  ఇక #మహేష్27 ను గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తారు. ఈ సినిమాకు సందీప్ వంగాను దర్శకుడిగా అనుకుంటున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టులో భారీ మార్పు చేసుకోనుందట.మహేష్ సినిమాకు ఓ అనుభవజ్ఞడైన దర్శకుడు అవసరం అనే ఆలోచనతో అల్లు అరవింద్ ఉన్నాడట. అందుకే సందీప్ వంగా స్థానంలో క్రిష్ ను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడట.  క్రిష్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే #మహేష్ 27 పై వర్క్ మొదలు పెడతాడని అంటున్నారు.  క్రిష్ గతంలో మహేష్ బాబు తో సినిమా చేయడానికి ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. 'శివం' పేరుతో ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని మహేష్ ను కలిశాడని అన్నారు కానీ ఎందుకో అది వర్క్ అవుట్ కాలేదు.

క్రిష్ టాలెంట్ మీద ఎవరికీ సందేహాలు లేవుగానీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ విషయానికి వస్తేమాత్రం వీకే.  పైగా మహేష్ లాంటి సూపర్ స్టార్ ను హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానం కూడా ఉంది. క్రిష్ ఎంచుకునే సబ్జెక్టులు క్లాసీగా ఉంటాయి. హిస్టారికల్ సినిమాల్లో ఎక్స్ పర్ట్.  కానీ మహేష్ బాబుకు సూటయ్యే కమర్షియాలిటీ ఉన్న స్క్రిప్ట్ ను తయారు చేయగలడా లేదా అనేది కూడా సందేహమే. ఈ లెక్కన అల్లు అరవింద్ మహేష్ బాబు కోసం క్రిష్ ను ఎంచుకోవడం కరెక్టేనా కదా అన్నది ఓ పెద్ద ప్రశ్న!