మహేష్ కూడా యుట్యుబ్ రికార్డ్ కొట్టాడు

Sat Jul 11 2020 17:20:01 GMT+0530 (IST)

Mahesh also broke the YouTube record

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఇంకా అల వైకుంఠపురంలో చిత్రం కలెక్షన్స్ విషయంలో పోటీ పడ్డాయి. చివరకు అల వైకుంఠపురంలో చిత్రం మెజార్టీ వసూళ్లు దక్కించుకోవడంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల పాటల విషయంలో కూడా మొదట పోటీ అన్నారు. కాని అల వైకుంఠపురంలోని అన్ని పాటలు కూడా యూట్యూబ్ లో దుమ్ము రేపాయి. ఆ సినిమాలోని అన్ని పాటలు కలిపి ఒక బిలియన్ వ్యూస్ ను మించి రాబట్టాయి.టాలీవుడ్ లో గతంలో ఎప్పుడు ఏ సినిమా పాటలు దక్కించుకోని రికార్డులను అల వైకుంఠపురంలో పాటలు దక్కించుకున్నాయి. ఈ సమయంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటలు కూడా మంచి వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. తాజాగా సినిమాలోని మైండ్ బ్లాంక్ వీడియో సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.

దేవిశ్రీ స్వరాలతో పాటు ఈ పాటలో మహేష్ బాబు రష్మికల డాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ పాట యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధిస్తుంది. అనీల్ సుంకర ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మించాడు. మహేష్ ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ పాత్రలో నటించిన విషయం తెల్సిందే.