Begin typing your search above and press return to search.

లుక్స్ లో మహేష్ ని కొట్టేవాడే లేడుగా

By:  Tupaki Desk   |   9 Jun 2023 7:05 PM GMT
లుక్స్ లో మహేష్ ని కొట్టేవాడే లేడుగా
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో లలో ఒకడి గా ఉన్నాడు. అతను ఇప్పటి వరకు కెరియర్ లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతోన్న సినిమా కూడా తెలుగు లోనే తెరకెక్కుతోంది. గుంటూరు కారం టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం లో మొదటిసారి పక్కా మాస్ రోల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా తో హాలీవుడ్ దృష్టి ని కూడా ఆకర్షించడానికి జక్కన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ మూవీ లో వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా నటించబోతున్నాడు. మహేష్ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ లలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు.

ఈ యాడ్స్ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ లో సూపర్ స్టార్ అలరిస్తూ ఉండటం విశేషం. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వయస్సు తో పాటు అందం కూడా పెరిగే హీరోల లో మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటాడ ని కచ్చితంగా చెప్పొచ్చు. అతని లుక్స్, అందానికి విపరీత మైన అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. ప్రతి అమ్మాయి మహేష్ బాబు లాంటి మొగుడు కావాలని కోరుకుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో సరికొత్త లుక్స్ లో ఫోటోల ని పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ అభిమానులు అయితే విపరీతం గా ఈ పిక్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో కర్లింగ్ హెయిర్ స్టైల్ తో జీన్ టైపు షార్ట్ వేసుకొని ఫోటోల కి ఫోజులు ఇచ్చాడు.

బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని మహేష్ ఇచ్చిన ఈ లుక్స్ లో కాలేజీ కుర్రాడిలా మెరిసిపోతూ ఉండటం విశేషం. ఈ స్థాయి లో ఇలాంటి స్టైలిష్ లుక్స్ లో ర్యాంప్ వాక్ చేసే మోడల్ తరహా లో కనిపించాలంటే అది మహేష్ బాబు కి మాత్రమే సాధ్యం అవుతుందని సూపర్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.