మహేష్ త్రిపాత్రాభినయం.. అందుకేనా మేకోవర్?

Sat May 30 2020 09:15:03 GMT+0530 (IST)

Mahesh Babu Huge Makeover For Parasuram Movie

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27 సెట్స్ కెళ్లనున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో వంశీ పైడిపల్లి నుంచి ప్రాజెక్టును పరశురామ్ టేకోవర్ చేసాడు. ఇక ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31) రోజున ప్రారంభించనున్నారని ప్రచారం అవుతోంది. అంటే రేపు ఉదయం ఎలాంటి హంగామా లేకుండా అధికారికంగా ఠెంకాయ కార్యక్రమం చేసేయనున్నారని లీకులు అందుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ పరశురామ్ కానీ మైత్రి మూవీ మేకర్స్ బృందం కానీ అధికారికంగా ఎలాంటి వివరాల్ని వెల్లడించలేదు.ఎప్పటికప్పుడు ఈ మూవీకి సంబంధించిన సమాచారం ఫ్యాన్స్ ని ఎంతో ఎగ్జయిట్ చేస్తోంది. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ మూవీని తెరకెక్కించిన పరశురామ్ మహేష్ ని ఏ రేంజులో చూపించబోతున్నాడోనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటికే మహేష్ గెటప్ ఛేంజ్ చేశాడు. మాస్టర్ గౌతమ్ కి అన్నయ్యా.. అని ఆశ్చర్యపోయేంతగా టీనేజీ రూపం కనిపిస్తోంది. అంటే ఈ గెటప్ పైనే తొలి షెడ్యూల్ ఉంటుందని అర్థమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం జూన్ తొలి వారం నుంచి షూటింగులు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది కాబట్టి ఇప్పటికే  ఏర్పాట్లు సాగుతున్నాయనే అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పటికే మహేష్ 27 టైటిల్ కూడా రివీలైంది. టైటిల్ `సర్కార్ వారి పాట` అని గత కొద్ది రోజులుగా ప్రచారం అవుతోంది. తాజాగా మరో షాకిచ్చే విషయం లీకైంది. ఈ క్రేజీ మూవీలో మహేష్ త్రిపాత్రాభినయం చేస్తున్నారట. టీనేజీ .. మిడిలేజీ.. కాస్త ఏజ్డ్ పర్సన్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే త్రిపాత్రాభినయం కెరీర్ లోనే తొలిసారి. బాలనటుడిగా మహేష్ ద్విపాత్రాభినయం చేసినా హీరో అయ్యాక మాత్రం కూదరలేదు. కానీ ఇప్పుడు ఏకంగా త్రిపాత్రాభినయం చేసేస్తున్నాడన్న ప్రచారంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగ్జయిటయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి గౌతమ్ మీనన్ లా పరశురామ్ ఏదో గట్టి ప్రయోగమే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మహేష్ ఇమేజ్ కి తగ్గ కథాంశంతో గీత గోవిందం రేంజు సెన్సిబిలిటీస్ ని ఇందులో ఇన్ బిల్ట్ చేస్తే సక్సెస్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదేమో!