నాన్న కూచీ సితార ఎవిడ్ బుక్ రీడర్

Sat Jul 04 2020 15:00:43 GMT+0530 (IST)

Mahesh Babu Daughter Sitara Reading Books

సూపర్ స్టార్ మహేష్ గారాల కుమార్తె సితారకు డిజిటల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. స్టార్ డాటర్స్ లో ఇన్ స్టా మాధ్యమం సహా యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలతో స్పీడ్ మీదున్న క్యూటీగా సీతాపాపకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆద్య అండ్ సితార చానెల్ పాపులారిటీ తెలిసిందే. చానెల్లో తన ఫ్రెండు ఆద్యతో కలిసి సితార అల్లరి అంతా ఇంతా కాదు.డాడీతో పాటు విదేశాలకు షికార్ చేసినా.. లేదా సెట్స్ లో అల్లరి చేసినా ఆటలాడుకున్నా తనకే చెల్లింది. ఇక ఇంట్లో క్వారంటైన్ టైమ్ లో నాన్నతో కలిసి సితార వేషాలకు సంబంధించిన ఫోటోలు ఇటీవల అభిమానుల్లో వైరల్ అయ్యాయి.

కేవలం ఆటపాటలేనా.. అప్పుడప్పుడు తనలోని క్రియేటివిటీని పెంచే వ్యాపకాలు తనకు అలవాటే. ముఖ్యంగా సీతా పాపకు బుక్ రీడింగ్ హ్యాబిట్  మామ్ డాడ్ నుంచి అలవడిందట. ఇదిగో ఇలా చేతిలో ఏదో ఒక పుస్తకం లేనిదే తనకు నిద్ర పట్టదు. `ఫేమస్ ఫైవ్` స్టోరీ బుక్ చదువుతూ ఇదిగో ఇలా ఓ ఫోజిచ్చింది క్యూట్ గా. తాను కూడా ఎల్లపుడూ ఫేమస్ ఫైవ్ లో ఒకరిగా ఉంటుంది కాబట్టి ఇలా స్మైలిచ్చిందన్నమాట. అన్నట్టు సితార డెబ్యూ గురించి ఇప్పటికే ఘట్టమనేని ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. అందుకు ఇంకా సమయం ఉందని నమ్రత మాట దాట వేశారు. అయితే ఏదో ఒక సమయం సందర్భం చూసుకుని బాలనటిగా సితార ఎంట్రీ ఉంటుందనే అభిమానులు భావిస్తున్నారు. కాస్త వేచి చూడాల్సి ఉంది.