Begin typing your search above and press return to search.

బాబోయ్ సూపర్ స్టార్.. ఫాలోయింగ్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లా అవ్వాల్సిందే!

By:  Tupaki Desk   |   25 Nov 2020 3:45 AM GMT
బాబోయ్ సూపర్ స్టార్.. ఫాలోయింగ్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లా అవ్వాల్సిందే!
X
తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్ల మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఆయన సొంతం. ఆయన సినిమా రిలీజవుతుందంటే బొమ్మ దద్దరిళ్లాల్సిందే. ఆయన నటించిన సినిమాలు హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా మొదటి రోజు రికార్డ్స్ బద్దలు కొడుతుంటాయి. ఇక సోషల్ మీడియాలో మహేష్ హవా అంతా ఇంతా కాదు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో మహేష్ చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలు, తన ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకుంచూ ఉంటారు.

అందుకే ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నారు. మహేష్ బర్త్ డే, ఆయన సినిమాలకు సంబంధించిన వేడుకల సమయంలో అభిమానులు సోషల్ మీడియాలో చేసే సందడితో రికార్డ్ స్థాయిలో ట్వీట్స్ నమోదవుతుంటాయి. ఫేస్ బుక్ లోనూ సూపర్ స్టార్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ట్విట్టర్ లో 10.9 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ హీరోల్లోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా మహేష్ రికార్డ్ సృష్టించాడు.

తాజాగా మహేష్ మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
ఇన్ స్టాగ్రామ్ లో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 6 మిలియన్లు దాటింది. దీంతో ఈ న్యూస్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.